మద్యం సేవించేవారికి హెల్త్ టిప్స్

సరైన పద్ధతులను అలవర్చుకుంటే ఆల్కాహాల్‌తో వచ్చే ఇబ్బంది లేదని పలు అధ్యయనాల్లో తేలింది.

మద్యం తాగేవారికి కూడా హెల్త్ టిప్స్ ఉంటాయా ? అని ఆశ్చర్యపోవద్దు. హద్దులు మీరి మోతాదుకు మించి మద్యం తీసుకునే వారితోనే అసలు చిక్కొచ్చిపడేది. సరైన పద్ధతులను అలవర్చుకుంటే ఆల్కాహాల్‌తో వచ్చే ఇబ్బంది లేదని పలు అధ్యయనాల్లో తేలింది.అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఆల్కాహాల్ అబ్యూస్ అండ్ ఆల్కాహాలిజం (NIAAA) ఏం చెబుతోందంటే.. ఆల్కాహాల్ అలవాటు ఉన్నవారిలో మహిళలకు రోజుకు ఒక డ్రింక్, పురుషులకు రోజుకు రెండు డ్రింక్స్ మాత్రమే తీసుకోవాలట.

డీహైడ్రేట్ కాకుండా ఏం చేయాలంటే..

డీహైడ్రేట్ కాకుండా ఏం చేయాలంటే..

ఆల్కాహాల్ తీసుకునే సమయంలో మధ్య మధ్యలో నీరు కానీ లేదా నాన్-ఆల్కాహాల్ డ్రింక్స్ కానీ తీసుకోవాలి. దీనివల్ల శరీరం డిహైడ్రేషన్ బారినపడకుండా ఉండటంతోపాటు హ్యాంగోవర్ కూడా ఎక్కువ అవదు.

ఖాళీ కడుపుతో మద్యం మొదటికే మోసం..

ఖాళీ కడుపుతో మద్యం మొదటికే మోసం..

ఖాళీ కడుపుతో మద్యం అసలు తీసుకోవద్దు. మద్యం సేవించడానికంటే ముందు.. లేదా మద్యం తీసుకునే సమయంలోనే ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంపై మద్యం ప్రభావం ఎక్కువగా ఉండదని తేలింది.

మెడిసిన్స్ తీసుకునే సమయంలోనే మందు తాగడం..

మెడిసిన్స్ తీసుకునే సమయంలోనే మందు తాగడం..

మెడిసిన్స్, మందు ఒకేసారి కలిపి తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఔషధాలను, మద్యాన్ని ఒకేసారి తీసుకోకూడదు. మద్యం సేవించిన తరువాత సొంతంగా వాహనాన్ని డ్రైవ్ చేయడం మానేయాలి. ఇతరుల సహాయం తీసుకోవడం లేదంటే టాక్సీ బుక్ చేసుకుని వెళ్లడం మంచిది.

ఇతరులను బలవంత పెట్టడం..

ఇతరులను బలవంత పెట్టడం..

మద్యం తీసుకునే అలవాటే మంచిది కాదనే విషయం మనకు తెలిసిందే. అయితే కొంతమంది తమతో ఉన్నవారిని మందు తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. అంతేకాదు.. మోతాదుకు మించకుండా తీసుకునేవారిని కూడా ఒత్తిడి చేయకూడదు. మందు తాగేవారు తమ చుట్టూ ఉన్న పరిసరాలపట్ల జాగ్రత్త వహించాలి. ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవించి ప్రమాదానికి గురికాకూడదు. కొన్నిసార్లు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే డ్రింక్స్ తీసుకోవడంవల్ల కూడా ఇబ్బందులపాలయ్యే ప్రమాదం ఉంటుంది. కొత్తవారిని కలిసినప్పుడు, కొత్తవారి ఇంటికి వెళ్ళినప్పుడు మద్యం తీసుకోకుండా ఉండటమే మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+