Health tips: పచ్చి బొప్పాయితో బోలెడు హెల్త్ బెనిఫిట్స్.. ఆకులు కూడా అద్భుతమే!!
బొప్పాయి.. ఇందులో మన శరీరానికి కావలసిన బోలెడన్ని పోషకాలు ఉంటాయి. పండిన బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి బరువును నియంత్రిస్తుంది. బొప్పాయిలో ఉండే ఫైబర్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు జిమ్ కు వెళ్లడం కష్టంగా మారిన వారు డైట్ పాటించడం కష్టం అనుకుంటున్న వారు బొప్పాయిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఫైబర్ మరియు డైజెస్టివ్ ఎంజైమ్ లకు మంచి మూలకమైన బొప్పాయిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బరువు బాగా తగ్గుతారు. బొప్పాయిని తినడం వల్ల చాలా సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని కారణంగా పదేపదే తినాలి అనే ఫీలింగ్ లేకుండా పోతుంది. బొప్పాయిని అల్పాహారంగా తీసుకుంటే బరువు బాగా తగ్గుతారు.

అయితే పండిన బొప్పాయినే కాదు పచ్చి బొప్పాయి, వాటి ఆకులలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. పచ్చి బొప్పాయిలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల పచ్చి బొప్పాయి ముక్కలను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. డెంగ్యూతో బాధపడే వారికి బొప్పాయి ఆకుల రసాన్ని తాగిస్తే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే సైటో టాక్సిన్లు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.
పచ్చి బొప్పాయి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకులలోని పోషకాల వల్ల నెలసరి సమస్యలు ఉండవు బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను రాకుండా బొప్పాయి కాపాడుతుంది.
ఎవరికైనా గాయాలు అయితే ఆ గాయాలపై బొప్పాయి గుజ్జును రాయడం వల్ల కూడా గాయాలు త్వరగా నయం అవుతాయి.పచ్చి బొప్పాయిలో సపోనిన్, బీటా కెరోటిన్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, లైకోపీన్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పచ్చి బొప్పాయి శరీరం నుంచి వ్యర్ధాలను దూరం చేస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. కామెర్ల వ్యాధిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
పచ్చి బొప్పాయితో కూర వండితే ఆ కూర కూడా రుచిగా ఉంటుంది. పచ్చి బొప్పాయి కంటి చూపును మెరుగుపరుస్తుంది. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయిలో ఎక్కువ యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. పొఫైన్ , చైమో పోపైన్ లు శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
"మిల్ మేకర్ బ్రెడ్ ఆమ్లెట్" ఇలా చేస్తే ముక్క కూడా వదలరు !! -
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications