health tips: ఈ హెల్త్ డ్రింక్స్ తో అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది!!
అధిక రక్తపోటు.. ఇప్పుడు ఈ సమస్య భారతదేశాన్ని పట్టిపీడిస్తోంది. వృద్ధులు, యువకులు అన్న తేడా లేకుండా పదిమందిలో ముగ్గురు రక్తపోటు బారిన పడుతున్నారు. హైబీపీతో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. హైబీపీ కారణంగా వచ్చే ఇతర అనారోగ్య సమస్యలతో మంచాన పడుతున్నారు. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటి అంశం.
రోజువారి జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి మరియు చెడు జీవన శైలి కారణంగా హైబీపీ వస్తుంది. అయితే హైబీపీని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని హెల్త్ డ్రింక్స్ ఎంతో బాగా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు.రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి పుదీనా రసాన్ని తాగడం మంచిదని చెబుతున్నారు. పుదీనా రసాన్ని తాగితే హై బీపీ కంట్రోల్ అవుతుందని సూచిస్తున్నారు.

ఎలక్ట్రోలైట్స్ మరియు పొటాషియం సమృద్ధిగా ఉన్న కొబ్బరి నీళ్లు తాగితే హైబీపీ తగ్గుతుందని చెబుతున్నారు. ఇక అరటి పండ్లను పొటాషియం యొక్క పవర్ హౌస్ లుగా చెప్తారు. ఇవి రక్తపోటును తగ్గిస్తాయని చెబుతారు. అరటిపండు మిల్క్ షేక్ తాగితే కూడా హైబీపీ తగ్గుతుందని చెబుతున్నారు.
ఇక టమోటాలలో లైకోపీన్ ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంతో పాటు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కూడా కీలకంగా పనిచేస్తుంది. అంతే కాదు క్యాల్షియం మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉండే మజ్జిగ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాదు దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దానిమ్మ రక్తపోటును నియంత్రిస్తుంది. దానిమ్మ పండు జ్యూస్ తాగినా కూడా హై బీపీ కంట్రోల్ లోకి వస్తుంది.
ఇక బీట్ రూట్ లో నైట్రేట్లు ఉంటాయి .ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బీట్ రూట్ జ్యూస్ తాగితే కూడా హై బీపీ కంట్రోల్ అవుతుంది. ఇక రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు రక్తపోటును నియంత్రించడానికి హెల్త్ డ్రింక్స్ ను తరచూ తీసుకోవడం మంచిది. అయితే బిపి తో పాటు డయాబెటిస్ ఉన్న వారు మాత్రం వీటిని తీసుకునే విషయంలో వైద్యులను సంప్రదించాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications