Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Health tips: షుగర్ కంట్రోల్ కావటం లేదా? అయితే వీటిని ట్రై చేసి చూడండి!!

ప్రస్తుతం మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి డయాబెటిస్. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగానూ డయాబెటిస్ బాధితులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. ఏ ఇంట్లో చూసినా షుగర్ పేషెంట్స్ ఉంటున్న పరిస్థితి ఉంది. టైప్2 డయాబెటిస్ ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతోంది. మన ఆహారపు అలవాట్లు, మన జీవనశైలి, విపరీతంగా పెరిగిన పనిఒత్తిడి వంటి కారణాలు మనలను టైప్ 2 డయాబెటిస్ బారిన పడేలా చేస్తున్నాయి.

ఇక డయాబెటిస్ బారిన పడిన వారికి చాలా మందికి బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడం పెద్ద కష్టంగా మారుతుంది. అయితే మధుమేహాన్ని అదుపు చేయడం కోసం మందులు, ఇన్సులిన్ వాడుతున్న వారు మధుమేహం కంట్రోల్ కావడం లేదని ఆందోళన చెందే బదులు వ్యక్తిగతంగా తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Health tips high sugar levels in blood Do these natural remedies to control diabetes

టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ప్రతిరోజు భోజనం చేసిన తరువాత దాల్చిన చెక్క పొడిని నీళ్లలో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. రక్తంలో చక్కెర అదుపులోకి రావాలంటే ఆహారంలో తృణధాన్యాలను భాగం చేసుకోవాలి. తృణధాన్యాలు తినేవారు, బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ వంటివి తినేవారు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసుకోగలుగుతారు.

తాజా ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర, బచ్చలి కూర, మెంతికూర, గోంగూర వంటివి తరచూ తీసుకుంటూ ఉండాలి. వీటిని తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. మునగాకులో హైపర్ గ్లైసిమిక్స్ పై పోరాడే గుణాలు ఉంటాయి. కనుక షుగర్ కంట్రోల్ కావాలంటే మునగాకు ని ఆహారంలో భాగం చేసుకోవాలి.

కాకరకాయల రసాన్ని కానీ, కాకరకాయల కూరను కానీ ఆహారంలో భాగంగా చేసుకుంటే చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఉసిరి జ్యూస్ లేదా ఉసిరి పొడిని నిత్యం తీసుకోవడం వల్ల కూడా చక్కెర స్థాయిలు తగ్గుతాయి. పసుపుని ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే అది మన శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను పెంచి, షుగర్ ని తగ్గిస్తుంది.

ఇక మెంతులను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మధుమేహం కంట్రోల్ అవుతుంది. మెంతులను నీళ్లలో నానపెట్టి రాత్రంతా ఉంచి తెల్లవారుజామున ఆ నీటిని తాగడం వల్ల షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. మందులు మాత్రమే కాదు వీటిని ట్రై చేసి షుగర్ కు చెక్ పెట్టండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+