health tips: హార్మోన్ల అసమతుల్యత.. ప్రధానంగా ఈ ఆరు అలవాట్లతోనే!!

మన శరీరంలోని జీవక్రియలు సక్రమంగా నిర్వహించడానికి హార్మోన్ల పాత్ర ఎంతైనా ఉంటుంది. హార్మోన్లు సమతుల్యంగా ఉంటేనే జీవక్రియలన్నీ సక్రమంగా నిర్వహించబడతాయి. అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. హార్మోన్ల అసమతుల్యత వ్యక్తి యొక్క ఆరోగ్యంపై తీవ్రమైన పరిణామాలను చూపిస్తుంది.

శరీరంలోని హార్మోన్లను శరీరానికి రసాయన దూతగా చెబుతారు. ఇవి శరీరంలోని వివిధ విధులను నియంత్రించటంలో కీలకంగా పని చేస్తాయి. ప్రతీ ఒక్కరిలోనూ ఏదో ఒక నిర్దిష్ట దశలలో హార్మోన్ల అసమతుల్యత చోటు చేసుకోవటం సహజమే. అయితే అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ ఎండోక్రైన్ గ్రంథులు తమ పనితీరును అసలే నిర్వహించనప్పుడు హార్మోన్ల అసమతుల్యత అనారోగ్యాలకు కారణం అవుతుంది.

health tips: Hormonal imbalance.. mainly with these six habits!!

హార్మోన్ల సమతుల్యత లేకపోతే మనిషి ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. హార్మోన్ల అసమతుల్యతకు మనకు ఉండే కొన్ని అలవాట్లు కారణాలుగా చెబుతున్నారు. ఇక ఆ అలవాట్ల గురించి తెలుసుకుంటే.. ఒక 6 అలవాట్లు ప్రధానంగా హార్మోన్లపై ప్రభావం చూపిస్తాయి. అందులో మొదటిది చాలా తక్కువ ఆహారం తీసుకోవడం, తక్కువగా కూరగాయలు తినడం హార్మోన్లపై ప్రభావం చూపిస్తుంది. అసమతుల్యతకు కారణం అవుతుంది.

ఆల్కహాల్ సేవించడం హార్మోన్ల సమస్యలకు కారణంగా మారుతుంది. చాలామంది ప్రతిరోజూ వారి శరీరానికి కావలసినంత నీటిని తాగరు. అటువంటి వారిలో కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అంతేకాదు చాలామంది ప్రతిరోజు ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. కానీ అలా నిద్రపోరు. అలాంటి వారిలో కూడా హార్మోన్ల అసమతుల్యత చోటు చేసుకుంటుంది.

సరైన సమయంలో ఆహారాన్ని తీసుకోని వారిలో కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది అంతేకాదు విపరీతంగా కాఫీ తాగే వారిలో కూడా హార్మోన్ల అసమతుల్యత చోటు చేసుకుంటుంది. భావోద్వేగ సమస్యలు డిప్రెషన్ తో ఇబ్బంది పడే వారిలో కూడా హార్మోన్ల అసమతుల్యత చోటు చేసుకుంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+