health tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను ఎలా తగ్గించాలి?
మన ఆహారపు అలవాట్లు, సరైన జీవన విధానం లేకపోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొలెస్ట్రాల్ సమస్య అన్నది వందమందిలో 80 మందిని ఇబ్బంది పెడుతుంది. బయట తినే ఆహారంలో ఉపయోగించే నూనె ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునే ప్రయత్నం చేయకపోతే అది అనేక తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతుంది. ఒక్కొక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ కూడా జరిగి మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. దైనందిన జీవితంలో తెలియకుండానే తీసుకుని రకరకాల ఆహారం మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను గూడు కట్టుకునేలా చేస్తుంది.

ముఖ్యంగా కల్తీ నూనెల వాడకం, వాడిన నూనెలను మళ్ళీ మళ్ళీ వాడటం, నూనె ఎక్కువగా వాడటం, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్ ను పెంచేస్తాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మన ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. ఎటువంటి ఆహారం మన శరీరంలో కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
రోజువారీ ఆహారంలో బచ్చలి కూర, పాలకూర వంటి ఆకుకూరలు మనం తీసుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక చేపలు ఆహారంలో తీసుకోవటం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ పై ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఫైబర్ పుష్కలంగా ఉండే బొప్పాయిని తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు రక్తపోటు, డయాబెటిస్ కూడా కంట్రోల్లో ఉంటాయి. యాపిల్ లో ఉండే పెప్టిన్ అనే ఫైబర్ లోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. టమాటాలు కూడా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను అధిక రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడతాయి.
అవకాడో శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాదు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ కోసం ఆహారపు మార్పులు చేయడమే కాకుండా, మరీ డేంజర్ లెవెల్స్ లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే వైద్యుడిని సంప్రదించి మందులు వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications