Health tips: బొప్పాయిని ఇలా తింటే ఒక్క నెలలోనే బరువు చాలా తగ్గుతారు!!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ బిజీ లైఫ్ లో ఫిట్నెస్ కోసం చేయాల్సిన దానిని మర్చిపోతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఫలితంగా వారు తిన్నా, తినకపోయినా ఊబకాయ బాధితులుగా మారి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అయితే అటువంటి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సులభంగా బరువు తగ్గడానికి రోజు తినాల్సిన ఒక ముఖ్యమైన పండు ఉంది. ఆ పండు గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. బరువు తగ్గాలని భావించే వారు ఒక నెలరోజులు క్రమం తప్పకుండా బొప్పాయిని తినాలని డైటీషియన్స్ చెబుతున్నారు.

Health tips: If you eat papaya regularly you will lose a lot of weight in one month!!

బొప్పాయి లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో మంచి పోషకాలు ఉన్నాయి. ఇవి బరువును నియంత్రిస్తాయి. బొప్పాయిలో ఉండే ఫైబర్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు జిమ్ కు వెళ్లడం కష్టంగా మారిన వారు డైట్ పాటించడం కష్టం అనుకుంటున్న వారు బొప్పాయిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఫైబర్ మరియు డైజెస్టివ్ ఎంజైమ్ లకు మంచి మూలకమైన బొప్పాయిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బరువు బాగా తగ్గుతారు. బొప్పాయిని తినడం వల్ల చాలా సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని కారణంగా పదేపదే తినాలి అనే ఫీలింగ్ లేకుండా పోతుంది. బొప్పాయిని అల్పాహారంగా తీసుకుంటే బరువు బాగా తగ్గుతారు.

ప్రతిరోజు సాయంత్రం పూట ఒక గిన్నెడు బొప్పాయి ముక్కలను తినడం కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. బొప్పాయి జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. మన శరీరంలో కొవ్వును కరిగించడంలో బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది బీటా కెరోటిన్ యొక్క మంచి మూలకం కావడంతో ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి మరియు జీవక్రియను పెంచడానికి దోహదం చేస్తుంది.

ఎన్నో మంచి పోషకాలు ఉన్న బొప్పాయిని నెలరోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే కచ్చితంగా బరువు తగ్గుతారు. కనుక ఆరోగ్యాన్ని, ఫిట్ నెస్ ను ఇచ్చే బొప్పాయి పండును మర్చిపోకుండా ఆహారంలో భాగం చేసుకోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+