health tips: హై బీపీతో పెరుగుతున్న మరణాలు; బీపీ తగ్గటానికి సులభ మార్గాలివే!!
ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ అధికరక్తపోటు సమస్య సర్వసాధారణంగా మారుతుంది. అధిక రక్తపోటు వల్ల గుండెపై అదనపు ఒత్తిడి కలిగి హార్ట్ స్ట్రోక్ లకు కారణం అవుతుంది. అంతేకాదు అధిక రక్తపోటు వల్ల కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలా మరణాలు హైబీపీ వల్లనే జరుగుతున్నాయి.
అధిక రక్తపోటును నియంత్రించడానికి మనం ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటిస్తే అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. అరచేతులకు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అందుకే ప్రతి రోజూ మృదువుగా అరచేతులను మసాజ్ చేసుకోవడం అధిక రక్తపోటు బాధితులకు మంచిది.

హైబీపీ ఉన్నవారు రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను దిండు పై చల్లుకొని పడుకోవడం వల్ల, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ లో ఉండే గుణాలతో మీ శరీరంపై, మనస్సుపై ఆందోళన తగ్గుతుంది. రోజుకు ఒకసారి మీ పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టి, ఆపై పాదాలను మసాజ్ చేసుకోవటం వల్ల అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు.
అంతేకాదు రక్తపోటు బాధితులు గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేసుకోవడం వల్ల, కనుబొమ్మలను తేలికగా నొక్కడం వల్ల బ్లడ్ ప్రెషర్ ను తగ్గించుకోవచ్చు. రాత్రి భోజనం మరియు నిద్ర మధ్య మూడు గంటలపాటు గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాదు భోజనంలో కాస్త ఉప్పును తగ్గించి తినడం వల్ల అధిక రక్తపోటు కంట్రోల్ అవుతుంది.
ఇక ధూమపానం, మద్యపానం చేయడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. అందుకే ధూమపానం, మద్యపానం మానేస్తే బీపి కంట్రోల్ అవుతుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే అధిక రక్తపోటును కొంతమేర నియంత్రించవచ్చు. అధిక రక్తపోటు ఉన్న వారు దానిని కంట్రోల్ చెయ్యటం కోసం యోగా, వ్యాయామం వంటివి చేస్తే మంచిది. యోగా, మరియు వ్యాయామం అధిక బీపీని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు.. -
మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా! -
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications