Health tips: ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్.. వీటిని ఆహారంగా తీసుకుంటే మాయం!!
ఊపిరితిత్తులు మన శరీరంలో ప్రధాన అవయవాలు ఊపిరితిత్తులు మనం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజన్ ను గ్రహించి శరీరానికి అందిస్తాయి. ఆ తర్వాత ఆ అవయవం నుండి బయటకు వచ్చే కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహించి శ్వాస ద్వారా మళ్లీ బయటికి పంపిస్తాయి. ప్రస్తుతం పెరిగిపోతున్న కాలుష్యంతో ఊపిరితిత్తులు త్వరగా పాడైపోతున్నాయి. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ చేరి శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తున్నాయి. కాబట్టి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకుంటే వాటి సామర్థ్యం పెరుగుతుంది. ఊపిరితిత్తులను శుభ్రంగా, బలంగా ఉంచుకోవడానికి ఏమి చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడి ఇన్ఫెక్షన్ల నుండి అరటిపండు మనల్ని రక్షిస్తుంది. అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శ్వాసకోశ వ్యాధుల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్లమవుతాం.

ఇక ఊపిరితిత్తులను ఇన్ఫెక్షన్ బారి నుండి కాపాడే వాటిలో బచ్చలి కూర ఒకటి. బచ్చలి కూర లో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్ లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇక ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బ్రోకలీ తినడం ఎంతో మంచిది. బ్రోకలీ లో విటమిన్ సి, ఫోలేట్, మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఉంటుంది
ఇక ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరగడం మాత్రమే కాకుండా, శ్వాసకోశ వ్యాధుల నుండి వెల్లుల్లి కాపాడుతుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తింటే ఊపిరితిత్తులు బలంగా ఉంటాయి. ఇక ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడటానికి పసుపు బాగా పనిచేస్తుంది . పసుపులో కర్కుమిన్ అనే శక్తిమంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది. పసుపు నిత్యం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అల్లం ఉపయోగపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అల్లం టీ తాగడం వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఊపిరితిత్తులు శుభ్రపడి మన శ్వాస సమస్యలను తగ్గిస్తాయి. కాబట్టి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవారు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications