health tips: నిద్రలేమి సమస్య... లోపం ఇదే కావచ్చు; చెక్ చేసుకోండి!!

నిద్రలేమి.. ప్రస్తుత సమాజంలో ఇది ఒక అతి భయంకరమైన సమస్య. నిద్రలేమి కారణంగా మనిషి అనేక రోగాల బారిన పడతారు. నిద్రలేమి మన జీవితాన్ని నరకప్రాయంగా మారుస్తుంది. రాత్రి నిద్రపోలేని వాళ్ళలో హార్మోనల్ సమస్యలు పెరుగుతాయి. తగినంత నిద్ర పోవడం వల్లనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

నిద్ర లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతం చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్య కారణంగా దినచర్య కూడా దెబ్బతింటుంది. చేసే పనిలో ఉత్పాదకత తగ్గుతుంది. మంచి గాఢమైన నిద్రను పొందకపోతే, అందుకు ఇతర కారణాలతో పాటు మీ శరీరంలో విటమిన్ లోపం కూడా కారణం అయ్యి ఉండొచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

health tips Insomnia problem may be vitamin b6 deficiency Check it out

అసలు ఏ విటమిన్ లోపిస్తే నిద్రలేమి సమస్య వస్తుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మెలటోనిన్ మరియు సెరటోనిన్ అనే హార్మోన్లు మంచి నిద్రకు కారణంగా భావిస్తారు. విటమిన్ b6 ఈ రెండు హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. విటమిన్ b6 ఉన్న ఆహారాన్ని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే మంచి నిద్ర వస్తుంది.

విటమిన్ బి6 లోపం వల్ల శరీరంలో కారణమైన మెలటోనిన్ మరియు సెరోటోనిన్ హార్మోన్ల స్రావం తగ్గుతుంది. దీనివల్ల మనిషి రాత్రిపూట సరిగా నిద్ర పోలేరు. మంచి నిద్ర పోవాలంటే విటమిన్ b6 తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజు పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగితే విటమిన్ b6 పుష్కలంగా లభిస్తుంది.

అంతేకాదు వేరుశనగ, చికెన్, ఓట్స్, బాదం వంటి వాటిలో కూడా విటమిన్ b6 ఉంటుంది. ఇక మంచి నిద్ర కోసం విటమిన్ బి6 సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినడంతో పాటుగా యోగాను, వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలి. అలాగే బాగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. అప్పుడే మన హాయిగా నిద్రపో గలుగుతాం. మంచి నిద్ర మనలను ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+