health tips: కీళ్ళ నొప్పులా? అయితే ఈ సహజ చిట్కాలతో ఉపశమనం పొందండి!!

చాలామంది కీళ్లనొప్పులతో ప్రస్తుతం బాధపడుతున్నారు. ఒకప్పుడు వయసు మళ్ళిన వారికి, వృద్ధాప్య దశలో వచ్చే కీళ్ల నొప్పులు, ఇప్పుడు యుక్త వయసులో ఉన్న వాళ్లకు కూడా రావడం ప్రధానంగా కనిపిస్తుంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు రావడానికి ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు.

కీళ్ల నొప్పులు వచ్చినవారు నొప్పులతో వారు అనుభవించే బాధ వర్ణనాతీతం. అటువంటివారు పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పెయిన్ కిల్లర్స్ కి బదులు కొన్ని ఇంటి చిట్కాలను ప్రయత్నం చేస్తే మంచిదని చెబుతున్నారు నేచురోపతి వైద్యులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

health tips

కీళ్ల నొప్పుల నుండి మనకు ఉపశమనం కలిగించే వాటిలో ముఖ్యమైనది వాకింగ్. ప్రతిరోజు కొంత సమయం మనం క్రమం తప్పకుండా నడిస్తే కచ్చితంగా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక స్విమ్మింగ్ చేసినా శరీరానికి కావలసిన వ్యాయామం దొరుకుతుంది. దీనివల్ల కూడా కీళ్ల నొప్పులు బాగా తగ్గుతాయని చెబుతున్నారు.

కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి యోగ ఎంతో బాగా ఉపయోగపడుతుందని ఇది ఒక అద్భుతమైన వ్యాయామ మార్గమని చెబుతున్నారు. ఇక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు సైక్లింగ్ చేసినా మంచి ఫలితం ఉంటుందని, సైకిల్ తొక్కడం కీళ్లనొప్పుల నుండి రిలీఫ్ వస్తుందని చెప్తున్నారు. సైకిల్ తొక్కడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.

అంతేకాదు కీళ్ళ నొప్పులతో బాధపడేవారు లైట్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు చేస్తే కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది అని చెబుతున్నారు. ఇలా వ్యాయామం చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. ఇక చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఇంట్లో పనులు చేస్తే కూడా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. వినటానికి ఇది మనకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ రోజు ఇంటి పనులు చేస్తే కీళ్ల నొప్పులు చాలావరకు తగ్గుతాయి. ఇలా సహజ విధానాలతో ఈ చిట్కాల ద్వారా కీళ్ళ నొప్పుల నుండి రిలీఫ్ పొందొచ్చు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+