health tips: నిమ్మకాయలు ఎక్కువగా వాడుతున్నారా? అయితే డేంజర్లో పడ్డట్టే!!
నిమ్మకాయలు.. మన శరీరానికి, మన చర్మానికి బోలెడంత ఆరోగ్యాన్ని ఇస్తాయి. నిమ్మకాయ రసం శరీరం లోపలి మలినాలు తొలగించడానికి డిటాక్స్ డ్రింక్ గా మాత్రమే కాకుండా, మన చర్మం పై ఉండే మలినాలను, మృత కణాలను తొలగించి చర్మాన్ని కూడా కాంతివంతం అయ్యేలా చేస్తాయి. అయితే నిమ్మకాయలు మంచివే అయినప్పటికీ నిమ్మకాయలను ఎక్కువగా తినడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
నిమ్మకాయలు శరీరానికి ఆరోగ్యాన్నిస్తాయి. ప్రతిరోజు నిమ్మకాయతో రోజును ప్రారంభించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు మల మూత్రాల రూపంలో బయటకు వెళ్తాయి. ఫలితంగా ఆరోగ్యంతో పాటు, శరీరం కాంతివంతంగా కూడా మారుతుంది. తగిన మోతాదులో నిమ్మకాయలను వాడడం శరీర బరువును తగ్గించడమే కాకుండా, జీర్ణ వ్యవస్థకు కూడా బాగా మేలు చేస్తుంది. కానీ అతిగా నిమ్మకాయలను వాడితే మాత్రం అది ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది.

ఇక ఇంతకీ నిమ్మకాయల వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి అంటే.. అతిగా నిమ్మకాయలను ఆహారంలో భాగంగా తీసుకుంటే అనేక ప్రతికూలతలు ఉంటాయని చెబుతున్నారు. అధిక నిమ్మకాయల వినియోగం వల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఇది మైగ్రేన్ వంటి అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. నిమ్మకాయను ఎక్కువగా ఆహారంలో తీసుకోవటం వల్ల నిమ్మకాయలో ఉండే ఆమ్లగుణాలు దంతాల సున్నితత్వాన్ని పెంచుతాయి. దంత సమస్యలతో బాధపడుతున్న వారు నిమ్మకాయలను తినడం మానుకోవాలి.
నిమ్మకాయలను ఎక్కువగా తినడం వల్ల కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. ఎసిడిటీ ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువ నిమ్మకాయల్లోని పులుపు తినడం వల్ల గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలు వస్తాయి. ఇక కడుపుకు సంబంధించిన సమస్యలను నివారించాలంటే తప్పనిసరిగా నిమ్మకాయల వినియోగాన్ని పరిమితం చేయాలి.

నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ తో పాటు ఆక్సలేట్ లు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణం అవుతాయి. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు నిమ్మకాయల వినియోగానికి దూరంగా ఉండటమే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications