Health tips: ఈజీగా బరువు తగ్గాలా? అయితే వీటిని నానబెట్టి తినండి!!
సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, సరైన జీవన విధానం లేకపోవడం వల్ల చాలామంది ఊబకాయ బాధితులుగా తయారవుతున్నారు. శారీరక వ్యాయామం లేక, తీసుకునే ఆహారం ఏ విధమైన ఆహారం తీసుకోవాలో తెలియక చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యగా మారింది. అలాంటి ఊబకాయం తగ్గాలంటే మనం ఎటువంటి ఆహారాలు తినాలి? ఏం తినకూడదు? అనేది కూడా తెలిసి ఉండాలి.
బరువు తగ్గడానికి అనేక పద్ధతులను చాలామంది అనుసరిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలామంది జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. కొన్ని నానబెట్టిన ఆహారపదార్థాలను తింటే బరువు తగ్గుతారని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు. అయితే నానబెట్టిన వేటిని మనం తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతాం అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

నానబెట్టిన వేరుశనగలు పరగడుపున తింటే బరువు తగ్గుతారని చెబుతున్నారు. వేరుశనగలు రాత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఇది బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాల్ నట్ లను ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన వాటిని తింటే ఈజీగా బరువు తగ్గుతారు. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే నానబెట్టిన వాల్ నట్లను తినడం వల్ల అతిగా ఆహారం తినకుండా ఉంటారు. ఇది బరువును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
నీళ్లలో నానబెట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత నీళ్లలో నానబెట్టిన బాదం పప్పును పైన పొట్టు తీసి తినడం వల్ల బరువు తగ్గుతారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎండు ద్రాక్షను తినడం వల్ల కూడా బరువు ఈజీగా తగ్గుతారు. ఎండు ద్రాక్ష తినడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.
ఎండు ద్రాక్ష జీవక్రియను బలోపేతం చేస్తుంది. బరువు నిర్వహణలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.అంజీర పండ్లను రాత్రంతా నానపెట్టి, ఉదయం పరగడుపున తింటే ఇది ప్రభావవంతంగా బరువును తగ్గిస్తుంది. అంజీర పండ్లలో ఉండే పోషకాలు మన శరీరంలోని కొవ్వు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత పైన పేర్కొన్న వాటిని ఆహారంగా తీసుకుంటే బరువు ఈజీగా తగ్గుతారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications