health tips: ఐరన్ లోపం..అనేక అనారోగ్యాలకు మూలం; ఈ లక్షణాలతో గుర్తించండి!!
ఐరన్ లోపంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఐరన్ లోపం నుంచి బయట పడటానికి కావలసిన ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
చాలామంది శరీరంలో పోషకాల లేమితో అనేక అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా శరీరంలో ఐరన్ లోపం ఉంటే రకరకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఐరన్ లోపం ఉంది అని తెలుసుకోవడం ఎలా? అంటే ఐరన్ లోపం ఉన్నవారిలో కొన్ని లక్షణాలు బాగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపం ఉందని గుర్తించి, ఐరన్ లోపం నుంచి బయట పడటానికి కావలసిన ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ఐరన్ లోపం ఉన్న వారిలో ఈ లక్షణాలు ఉంటాయి
ఇంతకీ ఐరన్ లోపం ఉంటే ఉండే లక్షణాలు ఏమిటి? అంటే ఐరన్ లోపం ఉన్నవారు చిన్న చిన్న పనులకే ఎక్కువ అలసిపోతారు. ఐరన్ లోపం ఉన్నవారిలో చిరాకు ఎక్కువగా ఉంటుంది. మనిషి బలహీనంగా ఉంటారు. ఏదైనా పని చేయాలంటే వారికి ఏకాగ్రత సరిగ్గా కుదరదు. అంతేకాదు నిద్రలో కాళ్లు అదేపనిగా కదిలిస్తూ ఉంటారు. ఐరన్ లోపం ఉంటే శరీరంపైన దురదలు వస్తాయి. ఐరన్ లోపం ఉన్నవాళ్లలో చిన్న చిన్న విషయాలకు తీవ్రంగా ఆందోళన చెందే లక్షణం ఎక్కువగా ఉంటుంది.

ఐరన్ లోపం ఉంటే రక్తనాళాలలో సమస్య
ఇక ఐరన్ లోపం ఉన్న వారిలో థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగిస్తుంది. దానివల్ల హైపోథైరాయిడిజం అనే కొత్త సమస్య వారిలో ఉత్పన్నమవుతుంది. మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పి అదేపనిగా వస్తూ ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవాళ్లలో గుండె వేగంగా కొట్టుకుంటుంది, బరువు పెరుగుతుండడం, శరీరం చల్లగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపం ఎక్కువగా ఉన్న వారిలో జుట్టు ఊడిపోతుంది. గోళ్ళు పెళుసుగా మారడం కూడా ఐరన్ లోపం వల్లేనని చెబుతున్నారు.

ప్రపంచ జనాభాలో ఐరన్ లోపం ఎంత మందికి ఉందో తెలుసా
ఐరన్ లోపం ఉంటే ముఖం పాలిపోవడం, నాలుక మంట పుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతున్నా.. మన గుండె ఎక్కువగా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తున్నా.. ముఖం పాలిపోయినట్టు ఉందని ఎవరైనా చెప్పినా ఐరన్ లోపం ఉన్నట్టుగా గుర్తించాలి. నోటిలో పదేపదే అల్సర్లు వస్తున్న ఐరన్ లోపం ఉన్నట్టే అంటున్నారు. ప్రపంచ జనాభాలో 30 శాతానికి పైగా జనాభా ఐరన్ లోపంతో, రక్తహీనతతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలే శరణ్యం.

అధికంగా ఐరన్ తీసుకోవటం కూడా డేంజర్
అలా అని అధికంగా ఐరన్ తీసుకోవడం కూడా మంచిది కాదు. అధిక మోతాదులో ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే, శరీరానికి కావలసిన దానికంటే ఐరన్ మోతాదు ఎక్కువైతే దానివల్ల కాలేయం పాడవుతుంది. కాబట్టి ఐరన్ లోపంతో బాధపడుతున్నామా లేదా అన్నది కేవలం లక్షణాలను బట్టి నిర్ధారించుకోక, ఒక్కసారి వైద్యుని వద్దకు వెళ్లి చెక్ చేయించుకున్న తర్వాత నిర్ధారణకు రండి. ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అందుకు తగ్గ ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications