health tips: బరువు తగ్గాలా? చిన్న చిన్న జాగ్రత్తలతో ఆశ్చర్యకర ఫలితం.. అవేంటో తెలుసా!!
నిజ జీవితంలో మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలతో బరువు తగ్గవచ్చని, ప్రతిరోజు చిన్న జాగ్రత్తలనే మన జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెబుతున్నారు వైద్యులు.
బరువు తగ్గాలని ఎవరికి మాత్రం ఉండదు? ప్రతి ఒక్కరు బరువు తగ్గడం కోసం నానా పాట్లు పడుతున్నారు. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలితో విపరీతంగా ఒబేసిటీ బారిన పడుతున్న వారు, బరువు తగ్గడానికి రకరకాల ప్రయోగాలను చేస్తున్నారు. అయితే నిజ జీవితంలో మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలతో బరువు తగ్గవచ్చని, ప్రతిరోజు చిన్న జాగ్రత్తలనే మన జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెబుతున్నారు వైద్యులు. ఇక బరువు తగ్గాలని భావించేవారు జీవితంలో భాగంగా ప్రతిరోజు తీసుకోవలసిన ఆ చిన్న చిన్న జాగ్రత్తలను ఒకసారి తెలుసుకుందాం.

ఉదయాన్నే రెండు గ్లాసుల వేడి నీళ్ళు..
బరువు తగ్గాలి అనుకుంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక రెండు గ్లాసులు వేడి నీళ్లు తాగడం మంచిది. ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లు తాగడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. మన కడుపు శుభ్రపడుతుంది. ఇది బరువు తగ్గడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటితో జీవక్రియల వేగం పుంజుకుంటుంది. ఇది మన శరీరంలో కేలరీలను బర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది.

నిత్యం ఉదయాన్నే బరువు చెక్ చేసుకుంటే మేలు
బరువు తగ్గాలి అనుకుంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కాల కృత్యాలు తీర్చుకున్న తర్వాత బరువు చూసుకోండి. అప్పుడైతే మన బరువు మనకు కచ్చితంగా తెలుస్తుంది. ఎంత బరువు ఉన్నాము? ఎంత బరువు తగ్గాల్సిన అవసరం ఉంది? ఏం తినాలి? ఎంత తినాలి? ఏం తినకూడదు? ఏ సమయంలో ఏం చేయాలి? వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మనం కష్టం లేకుండా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

వ్యాయామం ఇలా చేస్తేనే ఫలితం
ఇక ఉదయం అల్పాహారం తీసుకునే ముందు బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామం చేయడం ఉత్తమమని సూచించబడింది. వ్యాయామం చేయడం వల్ల శరీరం శక్తి కోసం ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ ను వినియోగించుకుంటుంది. కాబట్టి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు బాగా తగ్గుతుంది. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కూడా మంచి మెరుగైన ఫలితం ఉంటుంది. ఇక వ్యాయామం చెయ్యటంలో కూడా ఒక నిర్దిష్టమైన విధానం ఉండాలి. కుదిరితే ఓవర్ గా చేసి లేదంటే బద్దకంగా పడుకుంటే ఫలితం ఉండదు.

అల్పాహారం లో ప్రోటీన్ తప్పనిసరి
ఇక అల్పాహారం తీసుకునేటప్పుడు తినే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండినట్టు ఫీల్ కలుగుతుంది. అంతేకాదు ప్రోటీన్ మన బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అల్పాహారంలో మినుములు, పెసర, వేరుశనగ వంటి పప్పులతో చేసే పదార్థాలు, గుడ్లు, పెరుగు వంటి వాటిని చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు.

ఆహారం విషయంలో ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి
ఇక బరువు తగ్గాలి అనుకునేవారు వేపుళ్ళ జోలికి అస్సలు పోవద్దు. తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. బరువు పెరిగే ఆహార పదార్థాలు ఏవేవి ఉంటాయో తెలుసుకొని వాటికి దూరంగా ఉండాలి. శుభ్రంగా ఓ జాబితా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక బర్గర్లు, పిజ్జాలు వంటి వాటికి పర్మినెంట్ గా గుడ్ బై చెప్పాలి. ఇక బయట ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినే అలవాట్లు మార్చుకోవాలి.

ఉదయం కచ్చితంగా సూర్యరస్మికి ఫోకస్ అయ్యేలా ఉండాలి
బరువు తగ్గాలి అనుకునేవారు ఉదయం తప్పనిసరిగా సూర్యరశ్మికి శరీరం ఫోకస్ అయ్యేలా చూసుకోవాలి. ఉదయాన్నే శరీరానికి కాస్త ఎండ తగిలితే శరీరంలో ఉన్న కొవ్వు కాస్త కరిగే అవకాశం ఉంటుంది. ఎండ ముదిరిన తర్వాత వెళ్లి ఎండలో నుంచున్నా కూడా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఉదయం మన శరీరంపై పడి సూర్యరశ్మి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు, మంచినీరు తాగే విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు, వ్యాయామం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బరువును సునాయాసంగా తగ్గొచ్చు. దానికోసం తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications