health tips: వారంరోజులు ఈ డైట్ చేస్తే మీ ఒళ్ళు లైట్ గా, హాయిగా!!
విపరీతంగా బరువు పెరిగితే మన పని మనం చేసుకోలేనంత ఇబ్బందిగా మారుతుంది. శరీరం మనకే బరువుగా అనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా బద్దకంగా ఉంటుంది. మన భారాన్ని మనమే మోయలేనంతగా ప్రతీపనికి కష్టంగా ఫీల్ అవుతాం. ఇక అటువంటి ఫీలింగ్ ఉన్న వాళ్లంతా వారం రోజుల పాటు ఒక డైట్ ఫాలో అయితే కాస్త బరువు తగ్గడంతో పాటుగా, మీ శరీరం లైట్ గా, హాయిగా వున్న ఫీలింగ్ కలుగుతుంది.
మరి వారం రోజులపాటు డైట్ లో భాగంగా ఏం చేయాలంటే, శరీరంలో కొవ్వు తగ్గించుకోవడానికి, స్లిమ్ గా ఉండడానికి, మనకు మనం మన శరీరాన్ని భారంగా కాకుండా హాయిగా ఫీల్ కావడానికి ఈ డైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికోసం చేయాల్సిందల్లా ఒక ప్రణాళిక ప్రకారం ఆహారపు అలవాట్లను మార్చుకోవడమే.

కాస్త బరువు తగ్గి శరీరం లైట్ గా ఫీల్ కావాలి అని భావించేవాళ్ళు భోజనం చేయడానికి ముందు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన సూత్రం తినడానికి ముందు నీళ్లు తాగాలి. ఎందుకంటే తినే ముందు నీళ్లు తాగితే వాళ్లు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. నీళ్లు తాగడం అతిగా తినకుండా నియంత్రిస్తుంది. నిర్దిష్ట సమయాల్లో మాత్రమే భోజనం చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేస్తూ, ఎంత పడితే అంత తినడం మంచిది కాదు.
ఒకేసారి ఎక్కువగా తినడం ఊబకాయులు గా చేస్తుంది. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ధాన్యాలకి బదులుగా ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినాలి. ఇవి మన శరీరాన్ని పోషకలోపం లేకుండా చేస్తాయి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లకు దూరంగా ఉండాలి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగించి మంరింత బరువు పెంచుతాయి.
ప్రతిరోజు కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలను, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా వారం రోజుల పాటు మన ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే కాస్త శరీర బరువును తగ్గించుకొని, మనకు మనం లైట్ గా, మన శరీరాన్ని హాయిగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications