health tips: వీరు దానిమ్మపండ్లు అస్సలు తినకూడదు!!
దానిమ్మ పండును మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలో రక్త లోపం ఉండదు. ప్రతిరోజు దానిమ్మ పండును తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. దానిమ్మ పండును తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే అందరికీ ప్రతిరోజు దానిమ్మ పండును తినడం హానికరమని చెప్పబడింది.
అసలు ఏ వ్యక్తులు దానిమ్మ పండును ప్రతిరోజు తినకూడదు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. దానిమ్మ పండును అలర్జీ సమస్యలతో బాధపడేవారు తినకుండా ఉంటే మంచిది. అలర్జీలతో బాధపడేవారు దానిమ్మ పండును తింటే శరీరంలో దానిమ్మ పండు రక్తాన్ని పెంచడం వల్ల, మరింత ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలర్జీలు ఉన్నవారు దానిమ్మ పండును తింటే ఎర్రటి దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.

దానిమ్మ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రక్త ప్రసరణ మందగించే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ రక్తపోటు ఉన్నవారు దానిమ్మ పండును తినకూడదని సలహా ఇస్తున్నారు. హై బీపీ ఉన్నవారికి దానిమ్మ పండును తినడం మేలు చేస్తుంది కానీ, లో బీపీ ఉన్నవారికి దానిమ్మ పండును తింటే హాని జరుగుతుంది. ఇక దానిమ్మ పండును తినాలి అనుకునేవారు ఎసిడిటీ సమస్యతో బాధపడితే దానిమ్మ పండును తినకుండా ఉంటేనే మంచిది.
దానిమ్మలో ఉండే ఆమ్లత్వ లక్షణాలు ఎసిడిటీని మరింత పెంచి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మలబద్ధకంతో బాధపడేవారు దానిమ్మ పండును ప్రతిరోజు తినడం మంచిది కాదు. మలబద్ధకంతో బాధపడేవారు దానిమ్మ పండును తింటే వారి సమస్య మరింత తీవ్రతరమవుతుంది. కడుపులో గ్యాస్ ఏర్పడటం వల్ల మంటగా ఉన్నవారు దానిమ్మ పండును తినకూడదు. వారు కచ్చితంగా దానిమ్మ పండును తినడం మానుకోవాలి.
ఇన్ఫ్లుఎంజా సమస్యతో లేదా దగ్గుతో బాధపడేవారు దానిమ్మ పండును తినకూడదు. ఇది ఇన్ఫెక్షన్ ను మరింత పెంచుతుంది. కాబట్టి పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండును తినకుండా ఉండాలని సలహా ఇవ్వబడింది. ఎప్పుడైనా అడపాదడపా కొద్ది మొత్తంలో దానిమ్మ పండు గింజలను తింటే తప్పులేదు కానీ, ఈ రోగాలతో బాధపడేవారు నిత్యం దానిమ్మ పండును ఆహారంలో భాగంగా చేసుకోకూడదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications