health tips: డయాబెటిస్ కు చెక్ పెట్టే పవర్‌ఫుల్ ఆకు!!

ప్రస్తుతం మన సమాజంలో రోజురోజుకీ డయాబెటిస్ బాధితులు పెరిగిపోతున్నారు. సరైన జీవన విధానం లేకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం కారణంగా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలోను ముగ్గురు డయాబెటిస్ బారిన పడుతున్నారని తాజా స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. ముందు ముందు డయాబెటిస్ అతి పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.

డయాబెటిస్ కు చెక్ పెట్టే అద్భుతమైన ఆకు
ఇక అటువంటి డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి క్రమబద్ధమైన జీవన శైలితో పాటు, కొన్ని ఆహారాలు కూడా బాగా పనిచేస్తాయని చెప్పొచ్చు. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో కాకరకాయ సూపర్ గా పని చేస్తుందని చెప్పొచ్చు. ఇక బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుకూరలు కూడా బాగా పని చేస్తాయి. అయితే డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి పుదీనా కూడా ఎంతో బాగా పనిచేస్తుందని ప్రస్తుతం గుర్తించారు.

health tips powerful leaves pudina that controls diabetes do you know how

రక్తంలో చెక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే పుదీనా
పుదీనా ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, మధుమేహానికి దివ్య ఔషధమని ప్రకృతి వైద్యనిపుణులు చెబుతున్నారు. పుదీనాలో రోస్మరినిక్ యాసిడ్ తోపాటు, ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి . రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. పుదీనాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి డయాబెటిస్ బాధితులలో ఆక్సీకరణను మెరుగుపరిచి, ఒత్తిడి మరియు వాపులను తగ్గించే విధంగా పనిచేస్తాయి.

పుదీనా మంచిదే కానీ.. ఇలా వాడొద్దు
పుదీనాలో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలామంది ఒత్తిడి కారణంగానే మధుమేహం బాధితులుగా మారుతున్నారు. అటువంటి వారిలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి పుదీనా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే పుదీనాను విపరీతంగా తీసుకోవడం మంచిది కాదు.

health tips powerful leaves pudina that controls diabetes do you know how

పుదీనా ఎక్కువ తీసుకుంటే ఈ సమస్యలు
తగినంత మోతాదులో పుదీనాను తీసుకోవడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది. పుదీనాను ఎక్కువగా తీసుకుంటే అలర్జీలు వంటి రియాక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిస్ బాధితులు పుదీనాను రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవడం మాత్రమే కాదు, తగినంత మోతాదులో మాత్రమే పుదీనాను తీసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+