Health tips:వర్షాకాలంలో పిల్లలకు సీజనల్ వ్యాధుల ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!
ప్రస్తుతం వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షాకాలం వర్షాలతో పాటుగా సీజనల్ వ్యాధులను కూడా తీసుకువస్తుంది. ముఖ్యంగా చిన్నారులు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో సాధారణంగా చిన్నారులలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వివిధ రకాల సూక్ష్మ క్రిములు వర్షాకాలంలో చిన్నారులకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కనుక వర్షాకాలంలో తల్లిదండ్రులు చిన్నారుల ఆరోగ్యంపై ముఖ్యంగా శ్రద్ధ పెట్టాలి.
ముఖ్యంగా వర్షాకాలంలో చిన్నారులు జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జీర్ణాశయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి ఫ్లూ జ్వరాలు, విరోచనాలు, వాంతులు కూడా వర్షాకాలం చిన్నారులలో ప్రధానంగా కనిపిస్తాయి.

అయితే వర్షాకాలం చిన్నారులను అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల ఆహారం, త్రాగునీరు విషయంలో పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున కాచి చల్లార్చిన నీటిని చిన్నారులకు త్రాగడానికి ఇవ్వాలి. సమతుల ఆహారాన్ని పిల్లలకు పెట్టాలి.
జంక్ ఫుడ్ తినకుండా జాగ్రత్త పడాలి. ఫాస్ట్ ఫుడ్ ల జోలికి పోకుండా చూసుకోవాలి. ఇంట్లో, ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. దోమలు, ఈగల బారి నుండి పిల్లలను కాపాడుకునే లాగా చర్యలు తీసుకోవాలి. దోమల వల్ల చిన్నారులకు మలేరియా, డెంగీ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. దోమల నుంచి పిల్లలను కాపాడండి.
పిల్లలు వర్షంలో తడవకుండా జాగ్రత్త పడండి. భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కునేలా చూడండి. త్వరగా ఆరని బట్టలను, తడిగా ఉండే షూస్ పిల్లలకు వేయకండి. వర్షా కాలంలో పిల్లలు మురికి నీళ్లలో ఆడుకుంటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి, వర్షంలో బయట ఆటలకు పిల్లలను దూరంగా ఉంచండి.
ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, వారిని పిల్లలకు దూరంగా ఉంచండి. ఆహారంలో నిమ్మకాయ, దాల్చిన చెక్క, అల్లం, తులసి వంటి వాటిని చేరిస్తే, ఇవి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. అనారోగ్యం బారిన పడకుండా పిల్లలను కాపాడతాయి. పిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అన్ని వ్యాక్సిన్ డోస్ లను ఇప్పించండి. ఈ జాగ్రత్తలతో పిల్లల ఆరోగ్యం కాపాడుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
"బ్రకోలి కర్రీ" ఎప్పుడైనా ట్రై చేశారా..? -
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే, సమస్యలన్నీ పరార్..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications