Health tips: టీని పదేపదే మరిగించి తాగితే డేంజర్ లో హెల్త్.. తెలుసుకోండి

చాలామంది టీ తాగేటప్పుడు విపరీతంగా మరిగించిన టీని తాగుతూ ఉంటారు. ఒకేసారి టీ పెట్టుకుని దానిని పదేపదే వేడి చేసుకుని తాగుతూ ఉంటారు. అది ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. అంతేకాదు టీ తాగే అలవాటు ఉన్నవారు రోజుటీ కు రెండు కప్పుల కంటే ఎక్కువ టీ తాగటం మంచిది కాదని చెప్తున్నారు.

ఎక్కువ మరిగించిన టీ తాగుతున్నారా?
టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరమని అనేక పరిశోధనలు చెబుతున్నాయని వైద్యులు అంటున్నారు. చాలా మంది టీ ప్రియులు రుచి పేరుతో ఎక్కువ సేపు మరిగించే టీ ను తాగుతూ ఉంటారు. కానీ అది వారి ఆరోగ్యాన్ని చాలా దారుణంగా మారుస్తుంది. బాగా ఎక్కువగా మరిగించిన టిని తాగడం వల్ల అనేక అనర్ధాలు కలుగుతాయి, కొత్త కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Health tips severe health issues with drinking repeatedly boiled tea

విపరీతంగా మరిగించిన టీ తాగితే అనర్దాలివే
విపరీతంగా మరిగించిన టీ ను తాగడం వల్ల అజీర్ణం సమస్య వస్తుంది. ఎసిడిటీ ఏర్పడుతుంది. కడుపుకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు రావడానికి ఇది కారణమవుతుంది. జీర్ణ సమస్యలతో ఇబ్బందులు పడవలసి వస్తుంది.. ఇక అధిక రక్తపోటు ఉన్నవారు పదేపదే మరిగించిన టీని లేదా పదేపదే వేడి చేసిన టీ తాగడం వలన శరీరంలో టానిన్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది.

రక్తహీనత, నిద్రలేమి కి ఇదొక కారణం
దీనివల్ల రక్తపోటు మరింత ఎక్కువవుతుంది. పదే పదే మరిగించిన టీ ని తాగడం వల్ల శరీరంలో టానిన్ మొత్తం పెరిగితే ఐరన్ స్థాయిలు ప్రభావితమవుతాయి. ఫలితంగా రక్తహీనత ఏర్పడుతుంది. విపరీతంగా మరిగించిన టీ ని పదేపదే తాగడం వల్ల టీ లో కెఫిన్ కంటెంట్ బాగా పెరుగుతుంది. దీని వినియోగం నిద్రలేమికి కూడా కారణం అవుతుంది.

టీ పదేపదే మరిగించి తాగటం మంచిది కాదు
విపరీతంగా మరిగించిన టీ ని ఎక్కువగా తాగడం ఆకలిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి టీ తాగాలని భావించేవారు రోజుకు రెండుసార్లు మాత్రమే, అది కూడా ఎప్పటిది అప్పుడు పెట్టుకొని తాగడం మంచిది. ఒకేసారి టీ పెట్టుకుని దానిని పదే పదే వేడి చేసుకుని తాగడం అస్సలు మంచిది కాదు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+