health tips: నిద్ర పట్టట్లేదా? ఈ పనిచేస్తే 5నిముషాల్లో నిద్రపోతారు!!
చాలామంది రాత్రివేళ నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందరూ నిద్ర పోతూ ఉంటే గదిలోనే అటు ఇటు తిరుగుతూ నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. నిద్ర కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారు కూడా లేకపోలేదు. నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్ కు అలవాటు పడిన వారు కూడా ఉన్నారు. అయితే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మందుల కంటే నిద్ర పోవటానికి ఒక చక్కని విధానాన్ని అలవాటు చేసుకోవాలి.
నిద్రలేమి టెన్షన్ ను వదిలేసి ఐదునిమిషాల్లో నిద్రపోయే ఆ విధానం ఏంటి? ఆ చిన్న ట్రిక్ ఏంటి అన్నది తెలుసుకోండి. ఈ చిన్న ట్రిక్ సహాయంతో కేవలం ఐదు నిమిషాల్లోనే ప్రశాంతమైన నిద్ర వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా సైన్యం నిద్రపోవడానికి ఈ చిన్న ట్రిక్ ను ఫాలో అవుతుందని అంటున్నారు. ఇక ఇది అలవాటు చేసుకుంటే ఇది మీ నిద్రను మెరుగుపరుస్తుంది.

బెడ్ పై పడుకున్న నిమిషాల వ్యవధిలోనే మీకు హాయిగా నిద్ర పడుతుంది. మరి ఆ ట్రిక్ ఏమిటి అంటే.. నిద్రపోవడానికి బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ముందు మీ శరీరాన్ని కామ్ డౌన్ చేసి, శరీరానికి విశ్రాంతినివ్వాలి. మనసులో నుండి ఆలోచనలను తీసివెయ్యాలి. ఆ తర్వాత నిదానంగా కళ్ళు మూసుకుని శరీరంలోని అన్ని భాగాలను రిలాక్స్ చేయాలి.
నుదుటి కండరాలను రిలాక్స్ చేయాలి. ఆ తర్వాత శ్వాస మీద దృష్టి పెట్టి భుజాలను కూడా రిలాక్సింగ్ మోడ్ లో ఉంచి ఉచ్వాస నిశ్వాసలపై దృష్టి పెట్టాలి. లోతుగా శ్వాస తీసుకుంటూ, మళ్లీ శ్వాస వదులుతూ శ్రద్ధ మొత్తం బ్రీతింగ్ పైనే పెట్టాలి. ఆ తర్వాత ఒక ప్రశాంతమైన సరస్సును గాని, చిన్న బెడ్ లాంప్ తో అందమైన బెడ్ పైన పడుకున్నట్టు ఊహించుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టాలి.
అప్పుడు కచ్చితంగా ఐదు నిమిషాల్లోనే నిద్ర పోతారని చెబుతున్నారు. ఈ ట్రిక్ తో మంచి హాయినిచ్చే నిద్ర మీ సొంతం అవుతుందని అంటున్నారు. మరి ఎందుకు ఆలస్యం.. నిద్ర రాక ఇబ్బంది పడేవారు ఏ సింపుల్ ట్రిక్ ను ఫాలో అవ్వండి. హాయిగా నిద్రపోండి.
disclaimer:ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications