Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

health tips: ఈ జ్యూస్ తో వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా ఉంటారు!!

వయసు పెరిగినా యవ్వనంగా, ఫిట్ గా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. ప్రతి ఒక్కరూ తమ వయసు ఎంత అయినప్పటికీ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. ఇక అలా యవ్వనంగా కనిపించాలి అనుకునే వారికి ఓ అద్భుతమైన ఆకు ఊహించని మంచి ఫలితాలను ఇస్తుంది. అదే మునగాకు.

మునగాకు పోషకాల గని. మునగాకుల్లో మనకు కావాల్సిన పోషకాలు విటమిన్లు, మినరల్స్ సంవృద్దిగా ఉంటాయి. క్యారెట్ తింటే వచ్చే విటమిన్ ఏ ని పది రెట్లు మునగాకుతో పొందవచ్చు. పాల నుండి లభించే కాల్షియం 17 రెట్లు మునగాకు నుండి వస్తుంది. అరటిపండు నుండి పొందే పొటాషియం 15 రెట్లు మునగాకు నుండి లభిస్తుంది. అలాంటి మునగాకు మనల్ని 300రోగాల నుండి కాపాడుతుంది.

 health tips: Stay young even in old age with drumstick leaves juice!!

మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మునగాకు జ్యూస్ తాగితే ఎప్పటికీ యవ్వనంగా, ఫిట్ గానే ఉంటారు అన్నది ప్రతి ఒక్కరూ నమ్మవలసిన నిజం. మునగాకు జ్యూస్ రోజూ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే శరీరాన్ని బలోపేతం చేయడానికి మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో క్యాల్షియం మరియు మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి.

మునగాకు జ్యూస్ మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు తీసుకోవాలి. ఇది రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలను శుభ్రం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మునగాకు రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ కూడా శుభ్రం అవుతుంది. అల్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది.

మునగాకు రసాన్ని తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మం యవ్వనంగా మారుతుంది. మీ వయసు ఎంత అయినప్పటికీ ఎవర్ యూత్ గా కనిపిస్తారు. కాబట్టి మునగాకు యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా ఉండాలనుకునేవారు క్రమం తప్పకుండా మితంగా మునగాకు జ్యూస్ ను తీసుకోండి. ఇక మునగాకు జ్యూస్ ఏ విధంగా తీసుకోవాలో నేచురోపతి వైద్యులను సంప్రదించి తెలుసుకోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+