health tips: కూరగాయల రారాజు వంకాయతో ఆశ్చర్యకర ఆరోగ్య ప్రయోజనాలు!!
మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో ముఖ్యమైనవి. మనం ఆహారంలో తీసుకునే కూరగాయలు. కూరగాయలలో ఉండే పోషకాలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే కూరగాయలలోనూ ఒక స్పెషల్ కూరగాయ చూస్తేనే ఆహా ఏమి రుచి అంటాం.. ఆ కూరగాయ ఏమిటో ఇప్పటికే అందరికీ అర్ధం అయ్యే ఉంటుంది.
కూరగాయల రారాజు వంకాయ. వంకాయ చాలా సాధారణమైన కూరగాయ అయినప్పటికీ దీనిని అందరూ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వంకాయలను ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచమంతా తింటారు. భారతదేశంలోనే కాకుండా చైనా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ వాళ్ళు వంకాయలను బాగా ఇష్టంగా తింటారు.

వంకాయలలో కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇది విటమిన్ ఏ లోపాన్ని నివారిస్తుంది. అందుకే వంకాయలను తింటే విటమిన్ ఏ మనకు పుష్కలంగా లభిస్తుంది. కంటి చూపును మెరుగు పరచడానికి విటమిన్ ఏ చాలా ముఖ్యమైనది. ఆహారంలో వంకాయలను భాగంగా చేసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వంకాయలను ఆహారంలో భాగంగా చేసుకోని వారు దృష్టి సమస్యలకు లోను కావలసి వస్తుంది. వంకాయలలో ఫైబర్ యొక్క గొప్ప గుణాలు ఉన్నాయి. వంకాయలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వంకాయలు టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి డయాబెటిస్ ను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
వంకాయలు తక్కువ కేలరీల ఆహారం. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో వంకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వంకాయలను వండేటప్పుడు ఎక్కువ నూనె పోసి వండకూడదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. లేకపోతే వంకాయల వల్ల వచ్చే గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు రాకుండా పోతాయి.
వంకాయలను క్రమం తప్పకుండా తింటే ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే వంకాయలు మన శరీరంలో ఉన్న విష వ్యర్ధాలను బయటకు పంపిస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇంత ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వంకాయలను కచ్చితంగా ప్రతి ఒక్కరు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని అంటున్నారు డైటీషియన్లు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications