health tips: పది ప్రాధమిక సూత్రాలతో ఆరోగ్యంగా.. ఇంకా ఫిట్ గా!!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏ ఇంట్లో చూసినా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ సంపాదించిన దానిలో సగభాగానికి ఎక్కువ రోగాలకు మందులకే పోతుంది. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటే జబ్బుల బారిన పడరు. ఆసుపత్రులకు, మందులకు అనవసరంగా డబ్బు వృధాగా ఖర్చు చేయరు.
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీరోజు మన దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఒక పది ప్రాధమిక సూత్రాలను అర్ధం చేసుకుని పాటిస్తే కచ్చితంగా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటాము. ఇక వాటి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు 10 మంచి అలవాట్లను నేర్చుకుంటే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండొచ్చు. అంతేకాదు ఫిట్ గా కూడా కనిపించవచ్చు.

మరి అలవాట్ల గురించి చెప్పుకోవాలంటే పౌష్టికాహారాన్ని ప్రతిరోజు తినాలి. మనం తినే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విపరీతమైన నూనె తో చేసిన ఆహార పదార్థాలను తినకుండా ఉంటేనే మంచిది. మనం తీసుకునే ఆహారంలో చక్కెర లేకుండా చూసుకోవాలి. అంతేకాదు మద్యపానం అలవాటు లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ లేకుంటే ఆరోగ్యంగా ఉండడం కష్టం. కాబట్టి వ్యాయామాన్ని మర్చిపోకూడదు.
ఎప్పుడు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి తగినంత మంచి నీటిని తాగాలి. విటమిన్ సి మన శరీరంలో తగినంత ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఎల్లప్పుడు శుభ్రంగా ఉండాలి. గట్ హెల్త్ ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు తగినంత నిద్ర పోవాలి. ఈ అలవాట్లను చేసుకుంటే ఆరోగ్యంగానూ , ఫిట్ గాను ఉంటాము.
ఎవరైతే ప్రతిరోజూ పైన పేర్కొన్న ప్రాథమిక సూత్రాలను తమ జీవితంలో భాగంగా చేసుకుంటారో అలాంటివారు ఆరోగ్యంగా ఉండడంతోపాటు, అనుకున్నది సాధించగలుగుతారు. సంతోషకరమైన జీవనాన్ని గడుపుతారు. మరింకెందుకు ఆలస్యం .. ప్రతీరోజూ ఈ మంచి అలవాట్లను చేసుకోండి. ఆపై మీరే మీ ఆరోగ్యంలో మార్పు చూడండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications