health tips: ఎసిడిటీ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన వంటింటి చిట్కాలు ఇవే!!
చాలా మంది ఏది తిన్నా జీర్ణం కాక ఎసిడిటీ సమస్యతో బాధపడుతూ ఉంటారు. విపరీతంగా కడుపులో గ్యాస్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కడుపులో మంట తగ్గాలంటే ఎసిడిటీ సమస్య పోవాలంటే, కడుపు బాగా రిలీఫ్ కావాలంటే కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని తెలుసుకుందాం.
కడుపులో ఎసిడిటీ సమస్య తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోతే వస్తుంది. ఎసిడిటీ సమస్య ఉన్నవారు సమయం ప్రకారం ఈజీగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి. మసాలా కూరలు, పుల్లటి పులుసులు తినకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ గ్యాస్ సమస్య వస్తుందని తెలిసినా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే కడుపులో మంటతో ఇబ్బంది పడాల్సివస్తుంది. అయితే ఈ అజీర్తి సమస్య ను తగ్గించుకోవడానికి వంటింట్లో ఉండే పదార్ధాలు బాగా ఉపయోగపడతాయి.

అందులో కొత్తిమీర బాగా పనిచేస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీరను తీసుకుంటే కడుపులో మంట త్వరగా తగ్గుతుంది. ఒక గ్లాసు మజ్జిగలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని తాగితే ఎసిడిటీ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు. అంతేకాదు గ్యాస్ సమస్యకు అల్లం మంచి మందుగా పనిచేస్తుంది. అల్లాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసుకొని రోజూ భోజనానికి ముందు కొద్దిగా అల్లాన్ని తింటే గ్యాస్ తగ్గుతుంది.
చిన్న అల్లం ముక్కను తినలేము అనుకునేవారు దానిని చక్కెరతో కాని, అన్నం ముద్దలో కానీ కలిపి తీసుకుంటే ఎసిడిటీ తగ్గుతుంది. ఎసిడిటికి సమస్యకు వెల్లుల్లి చాలా సహజ సిద్ధమైన మందుగా పనిచేస్తుంది. వెల్లుల్లి తిన్నప్పటికీ కడుపులో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. దాల్చిన చెక్క ను నీళ్ళలో వేసి కొద్దిగా మరిగించి ఆ తర్వాత దాని జ్యూస్ ను తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
మిరియాలను పాలలో కలుపుకొని తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది. కొబ్బరి నీళ్లు తాగినా గ్యాస్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఒక కప్పు నీళ్లలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, అర టీ స్పూను బేకింగ్ సోడా వేసుకుని కలుపుకుని తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications