Health tips: జలుబు, దగ్గుల నుండి ఉపశమనం ఇచ్చే పానీయాలు ఇవే.. ట్రై చెయ్యండి!!
ప్రస్తుతం చలికాలం కొనసాగుతుంది. ఏ ఇంట్లో చూసినా జలుబు దగ్గులతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. మందులు వేసుకున్నా వదిలిపెట్టని జలుబు ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే జలుబు, దగ్గులకు మందులు వేసుకోవడంతో పాటుగా ఉపశమనం పొందడానికి కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
జలుబు మరియు దగ్గుతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందడానికి అల్లం టీ మంచి ఎంపిక అని సూచిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జలుబు, దగ్గు నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు జలుబు దగ్గుతో బాధపడేవారు తులసి ఆకులను కూడా ఉపయోగించడం మంచిదని, తులసి టీ కూడా మేలు చేస్తుందని, తులసి టీ తాగితే కాస్త ఉపశమనం లభిస్తుందని, ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

జలుబు దగ్గుతో బాధపడేవారు వేడి పాలలో పసుపు వేసుకుని తాగితే మంచిదని చెబుతున్నారు. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతుకు ఉపశమనాన్ని ఇచ్చి ఎటువంటి నొప్పులనైనా తొలగిస్తాయి అని చెబుతున్నారు. అంతేకాదు జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే ఉపశమనం వస్తుందని, తేనె లోను జలుబును తగ్గించే లక్షణాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.
గొంతు నొప్పి, దగ్గుతో బాధపడేవారు కొద్దిగా వేడినీళ్లలో చిటికెడు ఉప్పు కలుపుకొని తాగితే మంచిదని చెబుతున్నారు. ఇక అంతే కాదు అర టీ స్పూన్ పసుపును ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగితే, జలుబు దగ్గు సమస్యలు తగ్గుతాయని కూడా చెబుతున్నారు. కాబట్టి జలుబు దగ్గుతో బాధపడేవారు మందులు వేసుకోవడమే కాదు, ఈ చిట్కాలను కూడా పాటిస్తే మంచిది.
ఇంట్లోనే మనం తయారు చేసుకోగలిగిన ఈ వేడి పానీయాలను తాగినట్లయితే ఉపశమనం దొరుకుతుంది అంటున్నారు. కాబట్టి తీవ్రమైన జలుబు , దగ్గు తగ్గక ఇబ్బంది పడుతున్న వారు ఈ పానీయాలలో ఏదైనా ఒక పానీయాన్ని సేవించి ఎంత రిలీఫ్ దొరికిందో గమనించండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications