health tips: జుట్టుకు శత్రువులు ఈ ఆహారాలు; వీటితో బట్టతలకు ఛాన్స్!!

జుట్టు ఆరోగ్యంగా ఉంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. కానీ చాలామంది జుట్టు తెగ ఊడిపోతుందని బాధపడుతూ ఉంటారు. వాతావరణంలోని కాలుష్యం, మనం తీసుకునే ఆహారం, ఇతరత్రా అనారోగ్య సమస్యలు జుట్టు ఊడిపోవడానికి ప్రధానమైన కారణాలు. అయితే కొన్ని ఆహారాలు జుట్టుకు శత్రువులుగా మారి జుట్టు ఊడిపోయేలా చేస్యితున్నా.

సాధారణంగా వృద్ధాప్యంలో ఎవరికైనా జుట్టు పల్చబడుతుంది. కానీ ప్రస్తుతం చిన్న వయసులోనే చాలామందికి జుట్టు పల్చబడుతుంది. చెడు జీవనశైలి, ఒత్తిడి వంటి అనేక కారణాలు దీని వెనుక ఉన్నాయి. కొన్ని ఆహారాలు కూడా జుట్టును ప్రభావితం చేస్తాయి. దీనివల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. ఫలితంగా మనకు చిన్న వయసులోనే బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది.

health tips

జుట్టుని బలహీనం చేసే ఆ ఆహారాలు ఏమిటి? ఎటువంటి ఆహారాలు మన జుట్టుకు శత్రువులు? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలను చాలామంది తింటూ ఉంటారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ తినడం వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. ఈ ఆహారాలు ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా ప్రమాదకరమైనవి.

అంతేకాదు ఎక్కువ చక్కెర మరియు శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్లు తినడం వల్ల కూడా జుట్టు పెరుగుదల మందగిస్తుంది. అవి రక్తనాళాలను దెబ్బ తీస్తాయి. దీనివల్ల ఆక్సిజన్ మరియు సూక్ష్మ పోషకాలు తగినంత మొత్తంలో జుట్టు కుదుళ్లకు అందక జుట్టు బాగా ఊడిపోతుంది. అంతేకాదు చాలామంది రెడ్ మీట్ ను చాలా ఎక్కువగా తింటూ ఉంటారు. రెడ్ మీట్ ను ఎక్కువగా తినడం వల్ల కూడా జుట్టు బాగా పల్చబడి, బలహీనంగా మారుతుంది.

ఇక కొన్ని రకాలైన చేపలు కూడా మన జుట్టు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. చేపలలో ట్యూనా, స్వోర్డ్ ఫిష్, మాకేరెల్ వంటి చేప రకాలు జుట్టుకు ఎక్కువగా హాని చేస్తాయి. కాబట్టి ఇటువంటి చేపలను తినకుండా ఉంటేనే మంచిది. అందుకే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు ఊడిపోయే ప్రమాదాన్ని నివారించవచ్చు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+