Health tips: ఈ ఆహారాలు పచ్చివే తింటే ఆరోగ్యానికి మేలు!!
చాలా వరకు మనం వండుకున్న ఆహారపదార్థాలను తింటుంటాం. అయితే మనం కొన్ని ఆహారాలను పచ్చివి కూడా తింటే మంచిదని చెబుతున్నారు. వండుకోకుండా పచ్చిగానే తింటే కొన్ని మేలు చేసే ఆహారాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇప్పుడు మనం పచ్చిగా తింటే మనకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం గురించి తెలుసుకుందాం.
పచ్చిగా తింటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలలో కీరదోసకాయ ఒకటి. కీర దోసకాయను పచ్చిగా తింటేనే మంచిది. ఇది చాలా రుచిగా ఉండటంతో పాటుగా, బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. బచ్చలి కూర ఆకులను పచ్చివిగా తింటే మంచిది. బచ్చలికూరలో విటమిన్ సి, విటమిన్ ఈ, ఫైబర్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి.

బీట్ రూట్ ను పచ్చిగా తింటేనే మంచిది. బీట్ రూట్ లో అధికంగా పోషకాలు ఉంటాయి. బీట్ రూట్ ను సలాడ్ లో కూడా తినవచ్చు.
క్యారెట్లను పచ్చిగా తింటేనే మంచిది. వండిన దానికంటే క్యారెట్లను పచ్చిగా తిన్నప్పుడే అది మన శరీరానికి మేలు చేస్తుంది. క్యారెట్లు శరీరానికి, కళ్ళకు మేలు కలిగించే ఆహారం.
ఇక టమాటాలను వండుకున్న వాటికంటే పచ్చిగా తింటేనే ఆరోగ్యం. పచ్చి టమోటాలను తింటే అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. టమాటాలు చర్మానికి కూడా చాలా మంచి పని చేస్తాయి.పచ్చి ఉల్లిపాయను కూరల్లో వేసుకుని వండుకున్న దానికంటే, పచ్చిగా తింటేనే ఆరోగ్యం. పచ్చి ఉల్లిపాయలలో సల్ఫర్ ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అంతేకాదు ఉల్లిపాయలు పచ్చివి తినటం డయాబెటిస్ ను, బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. వెల్లుల్లిని కూడా పచ్చిదే తింటే మంచిది. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. పచ్చిగా వెల్లుల్లిని తిన్నప్పుడే అది మన ఆరోగ్యానికి కావలసిన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

పచ్చిగా తింటే ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలలో బ్రోకలీ ఒకటి. క్యాలీఫ్లవర్ లాగా ఉండే బ్రోకలీ తో మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి శరీరానికి కావలసిన పోషణను అందిస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications