health tips: కిచెన్ లోని ఈ మసాలాలు మీ బరువును ఇట్టే తగ్గిస్తాయి!!

చాలా మంది ఇప్పుడు ఊబకాయంతో బాధ పడుతూ ఉంటారు. అయితే బరువు తగ్గటం కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మన ఇంట్లో , మన కిచెన్ లో ఉన్న కొన్ని దినుసులతోనే మనం బరువు ఈజీగా తగ్గొచ్చు. వంటింట్లో ఉండే నాలుగు పదార్థాలకు బరువును తగ్గించే శక్తి ఉంటుంది. ఇక ఆ పదార్థాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

బరువును తగ్గించడంలో, జీవక్రియను పెంచడంలో దాల్చిన చెక్క ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది థర్మో జెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. తద్వారా క్యాలరీలు బాగా ఖర్చవుతాయి. దీనివల్ల బరువు బాగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతీరోజు దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.

health tips: These spices in the kitchen will reduce your weight!!

అల్లం కూడా ఒక మంచి ఔషధ యుక్త పదార్ధం. ఇది జీవక్రియను మరింత పెంచుతుంది. అల్లం పోషకాల శోషణకు ఎంతగానో సహాయపడుతుంది. దాల్చిన చెక్క లాగా అల్లం కూడా ధర్మో జెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచడంతోపాటు, ఊబకాయం తగ్గించడంలో గణనీయమైన పాత్రను పోషిస్తుంది.

ఇక బరువును తగ్గించడంలో ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందులో అల్లిసన్ ఉంటుంది. ఇది జీవక్రియను గణనీయంగా పెంచుతుంది. కొవ్వును తగ్గించి, శక్తిగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక బరువును తగ్గించడంలో నల్ల మిరియాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. నల్ల మిరియాలు జీవక్రియను గణనీయంగా మెరుగుపరుస్తాయి.

నల్ల మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకుంటే తద్వారా కొవ్వు విచ్ఛిన్నం అవుతుంది. దీంతో బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఊపిరి కాయ బాధితులకు ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. పైపెరిన్ థర్మోజెనిసిస్‌ను నల్ల మిరియాలు మెరుగుపరుస్తాయి. నల్ల మిరియాల ద్వారా శరీరం వేడిని ఉత్పత్తి చేస్తుంది. కేలరీలను బర్న్‌ చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతుంది. ఇంట్లో మన వంట గదిలో ఉండే మసాలా దినుసులతోనే మనం ఈజీగా బరువు తగ్గొచ్చు.

disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+