health tips: మామిడి పండ్లను తినేముందు నీటిలో కచ్చితంగా నానబెట్టాలి? ఎందుకంటే!!

వేసవికాలం వచ్చేసింది. పండ్లకు రారాజు అయిన మామిడి పండ్లను మన ముందుకు తెచ్చేస్తోంది. మామిడి పండ్లను ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అయితే మామిడి పండ్లను తినే ముందు, మామిడిపండ్లకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవడం మంచిది.

మార్కెట్లో కొనుగోలు చేసి ఇంటికి తెచ్చిన మామిడి పండ్లను తినే ముందు రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలని చెబుతున్నారు. ఒకవేళ అలా మామిడిపండ్లను నానబెట్టకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మామిడి పండ్లను తినే ముందు నీళ్లలో నానబెట్టడం ఆరోగ్యానికి మంచిని చేస్తుంది. ఇలా నీళ్లల్లో మామిడి పండ్లను తినే ముందు నానబెట్టడం వల్ల వాటిపై ఉండే మలినాలు, రసాయనాలు తొలగిపోతాయి.

health tips: This is why mangoes should be soaked in water before eating !!

మామిడి పండ్లను నీటిలో రెండు గంటల పాటు నానబెట్టి, ఆపై తినడం వల్ల ఎటువంటి చర్మ సమస్యలు రావు. మామిడి పండ్లను నానబెట్టి తినకపోతే వేడి కురుపులు, మొటిమలు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. నీళ్ళలో నానబెట్టిన మామిడి పండ్లు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఎంతగానో పనిచేస్తాయి. నీళ్లలో మామిడి పండ్లను నానబెట్టడం వల్ల వాటిలో ధర్మో జనిక్స్ ఉత్పత్తి తగ్గుతుంది. మామిడి చెట్టుకు ఉండే సొన, మామిడిపండ్లపై పడి అలాగే ఉంటుంది. నానబెట్టకుండా తినడం వల్ల ఈ సొన ప్రభావంతో నోట్లో పుండ్లు వచ్చే అవకాశం ఉంది.

అంతేకాదు మామిడి చెట్ల నిర్వహణలో మామిడి సాగు చేసే రైతులు హానికరమైన పురుగు మందులు వాడుతారు. నీళ్లలో మామిడి పండ్లను నానబెట్టకుండా తింటే ఈ హానికరమైన పురుగు మందుల ప్రభావంతో తలనొప్పి, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కావచ్చు. ఇక మామిడి పండ్లను నానబెట్టకుండా తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

నీళ్లలో నానబెట్టి శుభ్రంగా కడిగిన మామిడి పండ్లను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరుగుతుంది. అందుకే మామిడి పండ్లను తినాలనుకునే వారు వాటిని కచ్చితంగా నీళ్ళలో కనీసం రెండు గంటలైనా నానబెట్టిన తర్వాతే తినండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+