health tips: ట్రైగ్లిజరైడ్స్ సమస్య.. గుండెకు చాలా డేంజర్.. బీ అలెర్ట్!!

సరైన జీవన విధానం లేకపోవడం వల్ల చాలామంది ట్రైగ్లిజరైడ్స్ సమస్యతో బాధపడుతున్నారు. ట్రైగ్లిజరైడ్స్ అనేది ఒక హానికరమైన కొవ్వు . ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో ఉండడం వల్ల అవి మన జీవక్రియను దెబ్బతీస్తాయి. రక్తంలోని గోడల్లో కొవ్వు చేరుకొని రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తనాళాల గోడలు దెబ్బతింటాయి. రక్తనాళాలలో పేరుకుపోయి ఉన్న కొవ్వు కారణంగా రక్త సరఫరాకు అడ్డంకి ఏర్పడుతుంది. దీంతో జీవక్రియ నెమ్మదిస్తుంది.

ట్రైగ్లిజరైడ్స్ కారణంగా గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.గుండెజబ్బులు ఉన్నవారిలో కొలెస్ట్రాల్ సాధారణంగా ఉన్నప్పటికీ ట్రైగ్లిజరైడ్స్ సమస్య అధికంగా ఉంటే సమస్య జటిలంగా మారుతుంది. ట్రైగ్లిజరైడ్స్ వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ సమస్యను ఈజీ గా తీసుకోకూడదు. ఈ సమస్య వచ్చినవారు వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ, ఆహారంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరిగే ఆహారాలను పూర్తిగా మానేయాలి.

triglyceridesproblem-

ఈ సమస్య రాకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటివి చేయకూడదు. కొవ్వుశాతం ఎక్కువగా ఉండే మాంసాహారాలను తినకూడదు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం వల్ల, తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాల వల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. జంక్ ఫుడ్స్ వల్ల ట్రైగ్లిజరైడ్స్ సమస్య ఎక్కువ అవుతుంది. ఫాస్ట్ ఫుడ్స్ కూడా ట్రైగ్లిజరైడ్స్ ను పెంచి మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి.

ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ సమస్య ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ బాధితులు ఎప్పటికప్పుడు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను ఎలా ఉన్నాయో పరీక్ష చేయించుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ కంట్రోల్లో ఉంటాయి సమస్య తగ్గుతుంది. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ సమస్యను కొంతమేరకు తగ్గించవచ్చు.

అంతేకాదు ఆహారంలో మార్పులు చేసుకుంటే ట్రైగ్లిజరైడ్స్ సమస్య కొంతమేరకు తగ్గుతుంది. ట్రై గ్లిజరైడ్స్ సమస్య ఉన్నవారు జొన్నలు, కొర్రలు, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ట్రైగ్లిజరైడ్స్ సమస్య తగ్గాలంటే ఆహారంలో చేపలను ఎక్కువగా తీసుకోవాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గిస్తాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+