health tips: వేగంగా బరువు తగ్గటానికి ఈ ఫుడ్ కాంబినేషన్స్ ట్రై చెయ్యండి!!
చాలామంది బరువు తగ్గాలని రకరకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. కొన్ని ఆహార పదార్థాలు బరువును తగ్గించడంలో గణనీయమైన పాత్రను పోషిస్తాయని నమ్ముతూ ఉంటారు. అయితే నిజంగానే కొన్ని ఆహార పదార్థాలు బరువును బాగా తగ్గిస్తాయి. కొన్ని కాంబినేషన్ లో ఆహార పదార్థాలను మనం నిత్యం తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతామని చెప్పొచ్చు. అటువంటి బరువు తగ్గే కాంబినేషన్ ఉన్న ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నిమ్మరసం, తేనే.. ప్రతిరోజు నిమ్మరసం, తేనెను గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని పరగడుపున తాగితే ఈజీగా బరువు తగ్గుతారు. నిమ్మరసం, తేనే బరువును తగ్గించడంలో ఒక మంచి కాంబినేషన్ అని చెప్తున్నారు. దీన్ని తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ అవ్వడమే కాకుండా శరీరం డిటాక్స్ ఫ్రీ అవుతుంది.

ఇక బరువును తగ్గించే మరొక మంచి కాంబినేషన్ రోజుకు మూడు, నాలుగు సార్లు గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ ని నిమ్మకాయతో కలుపుకొని రోజుకు మూడు, నాలుగు సార్లు తాగితే వేగంగా బరువు తగ్గుతారని పేర్కొంది. దీనివల్ల జీవక్రియ మెరుగుపడుతుందని, గ్రీన్ టీ తో పాటు నిమ్మరసాన్ని జోడించడం వల్ల చాలా ప్రభావవంతంగా బరువు తగ్గుతారని చెబుతున్నారు.
బరువును తగ్గించే మరో అద్భుతమైన కాంబినేషన్ స్ట్రాబెర్రీలు మరియు బ్లూ బెర్రీ లను ఓట్స్ తో కలిపి తినడం. స్ట్రాబెర్రీలు మరియు బ్లూబెర్రీ లలో శరీరానికి మేలు చేసే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని ఉదయాన్నే ఆహారంలో ఓట్స్ తో కలిపి తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.
పచ్చి ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్ లు బరువును తగ్గించటంలో ఉపయోగపడతాయి. ఇక వీటిలో ఆలివ్ ఆయిల్ కలుపుకుంటే బాగా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. యాపిల్ మరియు పీనట్ బటర్ కూడా బరువును తగ్గించటానికి బాగా ఉపయోగపడతాయి. యాపిల్ తో పాటు పీనట్ బటర్ కాంబినేషన్ ఎంతో మంచిది. గుడ్డుతో బచ్చలికూర కాంబినేషన్ కూడా బరువు తగ్గటంలో బాగా పనిచేస్తుందని అంటున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications