health tips: ఈజీగా బరువు తగ్గించే సూపర్ పానీయాలు ఇవే.. ట్రై చెయ్యండి!!

ఊబకాయం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరంగా తయారైన సమస్య. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఊబకాయం బారిన పడుతున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, సరైన జీవన విధానం లేకపోవడంతో ప్రతి ఒక్కరు ఊబకాయులుగా మారుతున్నారు. అయితే ఊబకాయం నుంచి బయటపడాలనుకునేవారు తమ జీవన విధానాన్ని మార్చుకోవడంతో కొంతమేర లబ్ధిని పొందవచ్చని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో ఊబకాయాన్ని తగ్గించే కొన్ని అద్భుతమైన పానీయాలను, ఇంట్లోనే తయారు చేసుకుని ట్రై చేయాలని, తద్వారా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

నిమ్మరసం
మరి ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గించే సూపర్ పానీయాల విషయానికి వస్తే బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది నిమ్మకాయతో తయారుచేసిన పానీయం. నిమ్మకాయ తేనె కలిపి ప్రతిరోజు కాస్త గోరువెచ్చని నీటిలో ఉదయాన్నే తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. నిమ్మకాయ జీర్ణవ్యవస్థను సరిగ్గా పనిచేసేలా చేయడంతో పాటు, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నిమ్మకాయ రసం డిటాక్స్ డ్రింక్ గా కూడా పనిచేస్తుంది. శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేయడానికి నిమ్మకాయ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపించి, కొవ్వును కరిగిస్తాయి. తద్వారా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

health tips: Want to lose weight? try these super drinks for fast weight loss!!

గ్రీన్ టీ, మెంతుల నీళ్ళు
ఈజీగా బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగితే కూడా ఫలితం ఉంటుందని చెబుతున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయని, ఊబకాయం తగ్గుతుందని అంటున్నారు. గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయని, ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయని చెబుతున్నారు. ఈజీగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు మెంతులను రాత్రి వేళ నానబెట్టి, ఆ నీటిని ఉదయాన్నే వడికట్టి ఖాళీ కడుపుతో తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని, బరువు తగ్గడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఆరెంజ్ రసం, మజ్జిగ
ఈజీగా బరువు తగ్గాలనుకునేవారు ఆరెంజ్ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. ప్రతిరోజు ఆరెంజ్ రసాన్ని నేరుగా తీసుకొని తాగడం వల్ల ఆరెంజ్ జ్యూస్ శరీరాన్ని డిటాక్స్ చేస్తుందని, ఫలితంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రతిరోజు మజ్జిగ తాగడం వల్ల కూడా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అనే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అందుకే వేసవిలో మజ్జిగ నువ్వు రెగ్యులర్ గా తాగడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+