సగ్గుబియ్యం ఆహారంలో భాగం చేసుకుంటే జరిగే అద్భుతాలు ఇవే!

ఆరోగ్యమే మహాభాగ్యం ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యకరమైన పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. మన శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాలలో ఈరోజు మనం సగ్గుబియ్యం గురించి చెప్పుకుందాం. సగ్గుబియ్యం లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

సగ్గుబియ్యంలో ఫుల్ పోషకాలు
సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేడ్లు, ప్రోటీన్లు, విటమిన్ సి, క్యాల్షియంతో పాటు విటమిన్ బి, ఫోలేట్, ఫైబర్, జింక్, ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు సగ్గుబియ్యంలో ఉంటాయి. మన శరీరానికి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. సగ్గుబియ్యాన్ని ఏ రూపంలో తీసుకున్నా మన శరీరానికి కావలసిన ఎనర్జీ వస్తుంది.

health wonders that can happen in our body when we eat saggubiyyam in our diet

బరువు తగ్గాలంటే సగ్గుబియ్యం బెస్ట్
సహజంగా బరువు తగ్గించడానికి సగ్గుబియ్యాన్ని చాలామంది ఉపయోగిస్తారు. సగ్గుబియ్యం లో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు తరచూ సగ్గుబియ్యం వాడడం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది. సగ్గుబియ్యాన్ని జావగా తీసుకుని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అంతే కాదు జీర్ణ సమస్యలు ఉన్నవారికి కూడా సగ్గుబియ్యం మంచి ఆహారం.

కండరాలకు బలం ఇస్తుంది, బీపీ తగ్గిస్తుంది
సగ్గుబియ్యం లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల అది బీపీని కంట్రోల్ చేస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. సగ్గుబియ్యం గ్యాస్ సమస్యలను తక్షణం తగ్గిస్తుంది. సగ్గు బియ్యంతో మంచి శక్తి వస్తుంది. మన శరీరంలో ఎనర్జీ లెవల్స్ సగ్గుబియ్యంతో పెరుగుతాయి.విరేచనాలు అయినప్పుడు సగ్గు బియ్యం తీసుకుంటే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

మెదడు చురుకుదనానికి సగ్గుబియ్యం
జ్వరం, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని జావ రూపంలో తీసుకుంటే చాలా మంచిది. సగ్గుబియ్యం లోని విటమిన్ కే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడును చురుగ్గా పని చేసేలా చేస్తుంది. సగ్గుబియ్యాన్ని ఆహారంగా చేసుకుంటే చాలా అనారోగ్య సమస్యలు పరారవుతాయని బోలెడు లాభాలు కలుగుతాయని డైటీషియన్లు చెబుతున్నారు.

ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలను అస్సలే మరచిపోవద్దు
ఎన్నో పోషకాలతో కూడుకున్న సగ్గుబియ్యాన్ని తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోండి. ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలను అస్సలే మరచిపోవద్దు. మంచి ఆహార అలవాట్లు కూడా మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+