Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మండే ఎండల్లో మిమ్మల్ని కూల్ చేసే కీరా దోసతో ఆరోగ్య అద్భుతాలు!

కీరా దోసకాయ.. వేసవిలో కీరా దోసకాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వేసవి కాలంలో నీళ్ళు ఎన్ని తాగిన వెంటనే దాహం వేస్తుంది. కీరా దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన ఈ కీరా దోసకాయలు శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతాయి.

కీరాదోసతో ఆరోగ్య ప్రయోజనాలు
ముఖ్యంగా ఈ వేసవి కాలంలో కీరా దోసకాయ పంట బాగా వస్తుంది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే కీరా దోసకాయ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కీరా దోసకాయ తినడం వలన జీరక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధక సమస్యను అరికడుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. కీరా దోసకాయను ఆహారంలో భాగంలో చేర్చుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది.

Health wonders with cucumber that will cool you down in the scorching sun

ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే కీరా దోస
కీరా దోసలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కీరా దోసకాయలో ఉండే మిటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.కీరా దోసకాయలలో ఉండే మిటమిన్ కే వలన ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. మరియు ఎముకలు బలంగా తయారవుతాయి.చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కీరా దోస నివారిస్తుంది. చర్మం ముడతలు రాకుండా సహాయ పడుతుంది. చర్మం పొడిబారకుండా కాంతివంతంగా ఉంటుంది..

కీరాదోసతో షుగర్ కంట్రోల్
డయాబెటిస్ వ్యాధితో బాధ పడేవారికి కీరా దోసకాయ తినడం వలన మంచి ప్రయోజనం కలుగుతుంది. ఉదయం,మధ్యాహ్నం సమయాల్లో ఆహారంలో కీర దోస కాయను చేర్చుకుంటే మీ షుగర్ కంట్రోల్ అవుతుంది. కీరా దోసకాయలో చాలా పోషకాలు ఉండటం వలన మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. కీరా దోసకాయలను తినటం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది.

మానసిక ఒత్తిడికి చెక్
మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటకు పంపి శరీరాన్ని రిపేర్ చేస్తుంది. ఎండాకాలంలో కీరా దోసకాయ శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. కీరా దోస మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కీరా దోసలో క్యాన్సర్ ను నిరోధించే గుణాలున్నాయి.కీరా దోస హై బీపీని తగ్గించటానికి, తలనొప్పి వంటి నొప్పుల నుండి ఉపశమనానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+