రోజూ చపాతి తిని విసిగిపోయారా?- ఇవి ట్రై చేయండి: టేస్టుకు టేస్టు హెల్తుకు హెల్తు
చపాతీలు అనగానే ఠక్కున మనకు గుర్తుకు వచ్చేది గోధుమపిండితో తయారు చేసినవే. రోజూ ఇవే చపాతీలు తినడం కొంత విసుగ్గానే అనిపిస్తుంటుంది చాలామందికి. అలాంటి సమయంలో దీనికి ప్రత్యామ్నాయంగా జొన్న, రాగి పండితో తయారు చేసిన చపాతీలను తీసుకోవచ్చు. అవి మంచి పోషకాలను కూడా అందిస్తాయి.
వీటితో పాటు క్వినోవా, వోట్స్ వంటి పోషకాలతో కూడిన చిరు ధాన్యాలను కూడా పిండిగా మార్చుకుని చపాతీలు వేసుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగుపడటానికి తరచూ పిండి రకాలను మార్చడం మంచిదే. గోధుమ హానికరం కానప్పటికీ, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో మార్చడం వల్ల బరువు తగ్గడానికి మంచి ఫలితాలు వస్తాయి.

బరువు తగ్గడం అంటే చపాతీలను తినడాన్ని వదిలివేయాలనుకోవడం కాదు. గోధుమకు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడమే. జొన్న, రాగి, సజ్జ, వోట్స్, క్వినోవా, బార్లీ అన్నీ గోధుమ కంటే పోషక ప్రయోజనాలను అందిస్తాయి.
గోధుమ పిండి: సంప్రదాయ ఆధారం
గోధుమ పిండితో చపాతీలు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. చిరు ధాన్యాలతో పోల్చితే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది- పెద్దగా అనారోగ్యకరమైనది కానప్పటికీ గోధుమ పిండిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగడానికి కారణమౌతుంది. బరువు పెరగడం వంటివి సంభవిస్తుంటాయి.
జొన్న పిండి:
గ్లూటెన్ రహితం.. జొన్న. ఫైబర్ అధికంగా ఉంటుంది ఇందులో. నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఆకస్మిక చక్కెర పెరుగుదలను నిరోధిస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి గోధుమ కంటే బెటర్ ఆప్షన్.
రాగి పిండి
రాగిలో కాల్షియం, ఐరన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా పొట్ట కొవ్వును తగ్గించాలనుకునే వారు దీన్ని విరివిగా వినియోగించవచ్చు. రాగి పిండితో తయారు చేసిన చపాతీలను రోజూ తీసుకోవచ్చు.
సజ్జ పిండి..
సజ్జలో ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. వీటి పిండితో చేసిన చపాతీలను రోజూ తీసుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి. శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తాయి. బరువు తగ్గడానికీ సహాయపడతాయి.
వోట్స్ పిండి
వోట్స్‌లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులో జెల్ లాగా ఏర్పడుతుంది. వోట్స్ పిండితో తయారు చేసిన చపాతీలు గోధుమ రోటీల కంటే మృదువుగా, తేలికగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహకరిస్తాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తాయి.
క్వినోవా పిండి
క్వినోవా పిండి గ్లూటెన్ రహితం. అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలతో కూడిన పూర్తి ప్రోటీన్‌ను అందిస్తుంది. ఇది కొవ్వును తగ్గించగలదు. అదే సమయంలో కండరాలు ఆరోగ్యంగా ఉండటానికీ సహాయపడుతుంది.
బార్లీ పిండి
బార్లీ పిండిలో బీటా-గ్లూకాన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించే కరిగే ఫైబర్. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియ మెరుగుపడటానికి, బరువు నియంత్రణకు సహాయపడతాయి.
Disclaimer: ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. జొన్న, రాగి వంటి ప్రత్యామ్నాయ పిండిలు బరువు నిర్వహణకు సహాయపడవచ్చు, వాటిని సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా తీసుకోవాలి.
-
"టమాటా - ఎండు చేపల కూర" ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ కావాల్సిందే..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications