ఎక్కువ టైం కంప్యూటర్, ఫోన్ చూస్తున్నారా? ఇలా చేయకుంటే షుగరు ఖాయం..!!
చాలా మందికి గంటల కొద్దీ ఫోన్..లాప్ టాప్ చూడటం అలవాటుగా మారింది. ఎలక్ట్రానిక్ స్క్రీన్లను ఎక్కువ సేపు చూస్తే కంటి సమస్యలు మాత్రమే తలెత్తుతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ అనేక మానసిక, శారీరక సమస్యలకు ఇది కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, అధిక స్క్రీన్ సమయం మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచు తోంది. తాజా అధ్యయనాల ప్రకారం ఈ సమస్య కారణంగానే షుగరు బాధితుల సంఖ్య యుక్త వయసులో పెరిగినట్లు గుర్తించారు. దీంతో, లాప్ టాప్ కే పరిమితం అయి ఉద్యోగాలు చేసుకునే వారికి వైద్యులు కొన్ని ముందస్తు సూచనలు చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది గంటల తరబడి కంప్యూటర్లతో ఉద్యోగాలు చేస్తున్నారు. ల్యాప్ టాప్ లతో యుద్దం చేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్, టీవీ స్క్రీన్‌లను చూడటం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. పిల్లలు, యువత నుండి వృద్ధుల వరకు, ప్రతి ఒక్కరూ స్క్రీన్ లను ఎక్కువగా చూస్తున్నారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా పెంచుతోంది. ఈ కారణంగా, డయాబెటిస్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

వర్క్ ఫ్రం హోం చేసే వారికి స్క్రీన్ చూడాల్సి న తప్పనిసరి పరిస్థితి ఏర్పడగా.. ల్యాప్ టాప్ లేదంటే కంప్యూటర్ల ముందు వాళ్లు గంటల కొద్దీ గడపాల్సి వస్తుంది. స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయని, దీర్ఘకాలంలో అవి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని అంటున్నారు. స్క్రీన్లు చూస్తూ ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. ఇలా శారీరక శ్రమ లేకపోగా ఎక్కువ క్యాలరీలను శరీరానికి అందించడం వల్ల కొవ్వు పెరిగి కొత్త సమస్యలకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
అలాగే ఎక్కువ స్క్రీన్ టైం ఉండే వారిలో ఒంటరితనం వేధిస్తుంది. అలాంటి వాళ్లు అందరితో కలిసి కాసేపు మాట్లాడటం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది. దీని వల్ల మానసిక సమస్యలు రావు. గంటల కొద్దీ కంప్యూటర్లు లేదంటే ల్యాప్ టాప్ ల ముందు పని చేసే అవసరం ఉన్న వాళ్లు ఎక్కువగా నీళ్లు తాగడం, ప్రతి గంటకు ఒకసారి వాకింగ్ చేయడం మంచిది. స్క్రీన్ టైం ఎక్కువగా కలిగిన వాళ్లు రాత్రి సరైన సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోవడం మంచిది.
కాబట్టి, ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయండి, ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండండి, అధిక బరువు ఉంటే తగ్గించుకోండి, ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి. ధూమపానం, మద్యపానం మాను కోవాలని.. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో..టీవీ, ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ చూడటం వల్ల భవిష్యత్తులో శారీరక, మానసిక సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
-
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు












Click it and Unblock the Notifications