Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ ఐదు పానీయాలతో డయాబెటిస్‌ ఇక కంట్రోల్..!!

మధుమేహం. ఈ మధ్య కాలంలో బాగా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. మారుతున్న జీవన శైలి.. ఆహారపు అలవాట్లు.. ఒత్తిడితో మధుమేహం బారిన పడుతున్న వారు ఎక్కువగా ఉంటు న్నారు. జీవన శైలిలో మార్పులు.. ఆహార నియంత్రణ.. శారీరక శ్రమ కొంత వరకు మధుమేహాన్ని అదుపులోకి తెస్తోంది. అదే సమయంలో ఈ ఐదు పానీయాలు డయాబెటిస్‌ నియంత్రణలో బలంగా పనిచేస్తాయి. వైద్యుడి సూచనలతో వీటిని తీసుకుంటే... షుగరు నియంత్రణలో అనూహ్య మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్‌ ఉన్నవారు రక్తంలో షుగర్‌ హెచ్చుతగ్గులపై ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే, ఈ మార్పులు కిడ్నీలు, నరాలు, గుండె సమస్యలకు దారి తీస్తాయి. మందులు, జీవనశైలి మార్పులు చాలా అవసరం. కాకరకాయ చేదుగా ఉన్నా, మధుమేహులకు ఇది ఔషధం లాంటిది. కాకరకాయ లో చారంటిన్‌, పాలీపప్టైడ్‌ లాంటి పదార్థాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ పనిచేసే విధానాన్ని మెరుగుపరుస్తాయి. ఉదయం పూట తాజాగా తీసిన కాకరకాయ రసాన్ని తాగటం ద్వారా ఫలితం ఉంటుంది. కాకరకాయ రసంతో ఉసిరి రసం కలిపి తాగితే రుచిగా ఉండటంతో పాటుగా షుగర్‌ను నియంత్రణలో ఉంచుతుంది. కిడ్నీ, కాలేయ ఆరోగ్యానికి కూడా సాయం చేస్తుంది. మెంతుల్లో కరిగే పీచు పదార్థం (సాల్యుబుల్‌ ఫైబర్‌) ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దానివల్ల అల్పాహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర నిల్వలు అమాంతం పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. మెంతులు రాత్రి నీటిలో నానబెట్టి.. ఉదయం ఆ నీటిని తాగాలి. దీని ద్వారా షుగర్‌ నియంత్రణలో ఉంటుంది.

homemade-drinks-may-lower-blood-sugar-levels-after-meals-here-the-details

దాల్చిన చెక్క నీరు సైతం శరీరంలోని కణాలు షుగర్‌ను బాగా గ్రహించేలా సాయం చేస్తుంది. ఒక స్పూన్‌ దాల్చిన చెక్క పొడిని రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగాలి. దీన్ని తాగడం వల్ల రక్తంలో షుగర్‌ స్థాయులు తగ్గుతాయి. ఇన్సులిన్‌ నిరోధకత తగ్గుతుంది. అదే విధంగా ఉసిరి కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరిలోని యాంటి ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనివల్ల షుగర్‌ లెవల్స్‌ అమాంతం పెరగడం, అకస్మాత్తుగా తగ్గడం ఉండదు. ఉదయం పూట నీటిలో ఉసిరి రసం కలిపి తాగాలి. ఇది రోజంతా షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతుంది.ఇక.. గ్రీన్‌ టీ తోనూ ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్‌ టీలోని పాలిఫెనాల్స్‌ శరీరంలోని కణాలు ఇన్సులిన్‌కు త్వరగా స్పందించేలా చేస్తాయి. ప్రతిరోజూ గ్రీన్‌ టీ తాగేవారిలో జీవక్రియలు మెరుగుపడతాయి. చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. మంచి ఫలితం రావాలంటే, టీలో చక్కెర అస్సలు కలపకుండా తీసుకోవాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+