సమంతతో పాటు ఈ సెలబ్రిటీలు అందరూ డయాబెటిస్ బాధితులే.. ఎలా కంట్రోల్ చేస్తున్నారంటే!
మధుమేహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా మందిని ఇబ్బంది పెడుతోంది. మధుమేహం బారిన పడి ఇబ్బంది పడుతున్న వారిలో సామాన్య ప్రజలు మాత్రమే కాదు సినీ సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. ప్రతిరోజు వర్కౌట్ చేసేవారు, ఆహారం విషయంలో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునే సినీ సెలబ్రిటీలు కూడా మధుమేహ బాధితులే. అయితే తాము తమ డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
సమంత డయాబెటిస్ ఎలా కంట్రోల్ చేస్తారంటే
ఇక సినీ ఇండస్ట్రీలో మధుమేహం బారిన పడిన వారి విషయాలకు వస్తే టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ సమంత డయాబెటిస్ బాధితురాలు. ఇక ఈ విషయాన్ని సమంత నేరుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆహార నియమాలు పాటించడం, మధుమేహం యొక్క లక్షణాలను రెగ్యులర్ గా పర్యవేక్షించుకుంటూ అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడంతో తాను డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకుంటున్నానని సమంత తెలిపారు.

సోనమ్ కపూర్ డయాబెటిస్ ఇలా కంట్రోల్ చేస్తారు
ఇక 17 ఏళ్ల వయసులోనే బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ టైప్ వన్ డయాబెటిస్ బారిన పడ్డారు. అయితే క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించి ఆమె డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకుంటున్నారు. సోనమ్ కపూర్ చాలా స్ట్రిక్ట్ డైట్ ను ఫాలో అవుతున్నారు. ప్రతిరోజు యోగా చేయడంతో పాటు క్రమం తప్పకుండా స్విమ్మింగ్ కూడా చేస్తారు.
కమల్ హాసన్ డయాబెటిస్ కంట్రోలింగ్ టిప్స్
యూనివర్సల్ హీరోగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ కూడా మధుమేహ వ్యాధిగ్రస్తుడే.. ఆయన కూడా మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి ప్రతిరోజు యోగా, ఎక్సర్సైజులు చేస్తారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకొని ఫిట్ గా, ఎనర్జిటిక్ గా ఉంటున్న కమల్ హాసన్ డయాబెటిస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కంట్రోల్ లో ఉంచుతున్నారు.
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ డయాబెటిస్ ఎలా నియంత్రిస్తారంటే
ఇక బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కూడా మధుమేహం బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఆయన టైప్ వన్ డయాబెటిస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన నేరుగా వెల్లడించారు. దానిని కంట్రోల్ లో ఉంచడానికి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకున్నారు.
సెలబ్రిటీలు మాత్రమే కాదు డయాబెటిక్ ఎవరైనా ఇలా ఉండాల్సిందే
సెలబ్రిటీలు డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి క్రమబద్ధమైన ఆహారాన్ని తింటూ వ్యాయామం చేస్తూ ఎప్పటికప్పుడు డయాబెటిస్ ను పరీక్షించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ విధంగా డయాబెటిస్ ను వారు కంట్రోల్ లో ఉంచుతున్నారు. మనం కూడా డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచడానికి క్రమబద్ధమైన జీవన విధానాన్ని అనుసరించాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications