షుగర్ పేషెంట్లు డయాబెటిస్ నియంత్రణ కోసం రోజుకు ఎన్నిసార్లు తినాలి? ఎలా తినాలి?

ప్రస్తుత సమాజంలో చాలామంది టైప్ టు డయాబెటిస్ తో, లేదా ప్రీ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఇక అటువంటివారు డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. రోజుకు వారు ఎన్ని సార్లు తినాలి? ఎలా తింటే వీరు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచగలుగుతారు? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఆహారం ఇలా తీసుకుంటే షుగర్ కంట్రోల్
టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతిరోజు మూడుసార్లకు మించి ఆహారాన్ని తీసుకోవడంతో రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2018లో డయాబెటిస్ మరియు మెటబాలిజం జర్నల్ లో ప్రచురితమైన ఈటింగ్ త్రీ టైమ్స్ మే నాట్ బి ఆప్టిమల్ ఫర్ ఎవ్రీవన్ విత్ డయాబెటిస్ ఏ ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్ అనే అధ్యయనంలో ఈ విషయం నిరూపించబడింది.

How many times a day should diabetic patients eat to control diabetes How should they eat

డయాబెటిస్ బాధితులపై జరిపిన అధ్యయనం
ఇక ఈ నేపథ్యంలో డయాబెటిస్ బాధితులు ఎన్ని సార్లు తినాలి అనే విషయాన్ని గమనించినట్లయితే..ప్రీ డయాబెటిస్, టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవారు ఊబకాయం ఉన్న 47 మందిని మూడు పూటలా ఆహారం పెట్టి 12 వారాలపాటు గమనించారు. మరికొందరిని ఆరు పూటలా ఆహారం తినమని సూచించారు. ఇలా 24 వారాలపాటు వీరందరిని పరిశీలించగా ఎక్కువసార్లు తిన్నవారిలో మెరుగైన ఫలితాలు కనిపించినట్టు తేలింది.

ఆరుసార్లు తిన్నవారిలో ఆకలి తగ్గినట్టు గమనించిన పరిశోధకులు
అందరూ ఒకే మోతాదులో కేలరీలు తీసుకున్న క్రమంలో వీరి చెక్కర స్థాయిలు కూడా అదుపులో ఉన్నట్టు, మూడుసార్లు తిన్నవారితో పోలిస్తే ఆరుసార్లు తిన్నవారిలో ఆకలి వేయడం తగ్గిందని అధ్యయనంలో తేల్చారు. ఇలా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

కొద్దికొద్దిగా ఆహారం ఎక్కువ మొత్తంలో తీసుకోవటం మంచిది
అయితే ఆరుసార్లు తినడం వల్ల అంతగా బరువు తగ్గలేదని కానీ డయాబెటిస్ మాత్రం కంట్రోల్ లోకి వచ్చిందని చెబుతున్నారు. డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగించే డైట్ పద్ధతులలో ఇది ఒకటి. డయాబెటిస్ బాధితులు ఒక్కసారే ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+