మీ కంటిలో ఈ లక్షణాలు ఉన్నాయా- అసలు నిర్లక్ష్యం చేయద్దు..!!
వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. కంటి సమస్యలతో బాధ పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న వయసులోనే కంటి పరంగా అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, కంటి సమస్యల్లోని కొన్ని లక్షణాలు శరీరంలోని ఇతర భాగాల పనితీరుకు సంకేతాలుగా ఉంటాయి. దీంతో.. కంటి సమస్య వచ్చిన వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆలస్యం చేయటం ద్వారా కొత్త సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కంటిలో కొన్ని లక్షణాలను మాత్రం అసలు నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నారు.
వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్లకోమా అనే సమస్య ఎంత వేగంగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఇది కంటి నరాలను దెబ్బతీసి, చికిత్స చేయకపోతే కోలుకోలేని దృష్టి లోపానికి దారితీస్తుందని చెబుతున్నారు. గ్లకోమా దీని ప్రారంభ లక్షణాలు కనిపించవని, చాలామందిలో ఈ వ్యాధి ముదిరిపోయిన తర్వాతే బయట పడుతుందని చెబుతున్నారు. కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల ఆప్టిక్ నాడి దెబ్బతింటుందని, దృష్టి లోపం నెమ్మదిగా తగ్గుతుందంటున్నారు. గ్లకోమా సాధారణంగా నెమ్మదిగా, నొప్పి లేకుండా అభివృద్ధి చెందుతుంది. గ్లకోమాలో మొదట వస్తువులను పక్కల నుంచి చూసే సామర్థ్యం నెమ్మదిగా తగ్గుతుంది. కొంతమందికి దృష్టి అప్పుడప్పుడు అస్పష్టంగా లేదా మసకబారినట్లు.. నైట్ టైంలో లైట్ల చుట్టూ రంగుల వలయాలు, ముఖ్యంగా లైట్ల చుట్టూ ఇంద్రధనస్సు లాంటి కాంతి వలయాలు కనిపిస్తాయి. ఇది కంటి ఒత్తిడి పెరగడానికి ఒక సంకేతం.

అదే విధంగా ఒక కంటిలో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి, తగ్గిన లేదా మబ్బుగా ఉన్న దృష్టి, వికారం లేదా వాంతులు, కళ్లు ఎర్రబడటం, కన్ను ఉబ్బినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉంటే, మీకు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మయోపియా ఉన్నవారికి ఓపెన్ యాంగిల్ గ్లకోమా, దూర దృష్టి ఉన్నవారికి యాంగిల్-క్లోజర్ గ్లకోమా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వీటితో పాటుగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి కొన్ని సమస్యల వల్ల గ్లకోమా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే కంటిచూపు అంత మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications