నెయ్యి కల్తీ గుర్తించటం ఎలా? స్వచ్చమైన నెయ్యికి కల్తీ నెయ్యికి తేడా ఇదే!
మనం తినే ఆహారం అంతా ప్రస్తుతం కల్తీమయంగానే మారింది పాలు కల్తీ నీళ్లు కల్తీ, నెయ్యి కల్తీ బియ్యం కల్తీ ఇలా ప్రతి ఒక్కటి కల్తీ మయంగా మారింది. తాజాగా తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ కావడంతో ప్రస్తుతం కల్తీ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
నెయ్యి కల్తీ గుర్తించటం ఇలా
అసలు నెయ్యి కల్తీ కావడం ఏమిటి? నెయ్యిని కల్తీ చేయడానికి వాటిలో ఏమి కలుపుతారు? మనం కొనుగోలు చేసిన నెయ్యి కల్తీని గుర్తించడం ఎలా? అని అనేకరకాల ప్రశ్నలు తాజాగా ఉత్పన్నమవుతున్నాయి. అయితే స్వచ్ఛమైన నెయ్యికి కల్తీ నెయ్యికి తేడా ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. స్వచ్ఛమైన నెయ్యి గోల్డెన్ ఎల్లో, లైట్ బ్రౌన్ రంగులో ఉంటుందని, కల్తీ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి రంగు కంటే చిక్కటిరంగులో కనిపిస్తుందని చెబుతున్నారు.

స్వచ్చమైన నెయ్యికి కల్తీ నెయ్యికి తేడా ఇదే
ఇక స్వచ్ఛమైన నెయ్యి మంచి తీయని సువాసన వస్తే కల్తీ నెయ్యి అదోరకమైన కృత్రిమమైన వాసనతో ఉంటుందని నెయ్యి కల్తీ జరిగితే ఈజీ గానే గుర్తించవచ్చు అని చెబుతున్నారు. ఇక రుచి కూడా స్వచ్ఛమైన నెయ్యికి, కల్తీ నెయ్యికి తేడా స్పష్టంగానే ఉంటుందని చెబుతున్నారు. స్వచ్ఛమైన నెయ్యిని చెయ్యితో తాకితే ముద్దగా ఉంటుందని, పూస పూసగా అనిపిస్తుందని, అదే కల్తీ నెయ్యి నూనె మాదిరిగా జారిపోతుందని చెబుతున్నారు.
కల్తీ నెయ్యి తయారీ ఇలా
సోయాబీన్, పామాయిల్, సన్ ఫ్లవర్ వంటి నూనెలతో, రంగు, రుచి కోసం అనేక సింథటిక్ పదార్థాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని ఈ నెయ్యిని గుర్తించడం అంత కష్టమైన పని కాదని చెబుతున్నారు. నెయ్యి నాణ్యతను నిర్ధారించడానికి మనం ఇంట్లోనే సింపుల్ గా కొన్ని రకాల పరీక్షలు చేసుకోవచ్చని, తద్వారా నెయ్యి కల్తీ జరిగిందా లేదా అన్నది తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
ఫ్రిజ్ లో పెడితే నెయ్యి కల్తీ తేలిపోతుంది
స్వచ్ఛమైన నెయ్యి అయితే దానిని కొన్ని గంటల పాటు ఫ్రిజ్లో ఉంచితే గడ్డ కడుతుందని అలా గడ్డ కట్టలేదంటే అది కల్తీ నెయ్యిగా అర్థం చేసుకోవాలని చెబుతున్నారు . అంతేకాదు పొయ్యి మీద వేడి చేయడం వల్ల కూడా స్వచ్ఛమైన నెయ్యి, కల్తీ నెయ్యికి మధ్య తేడా తెలుస్తుందని చెప్తున్నారు.
వేడి చేసినా, నీటిలో కరిగించినా నెయ్యి కల్తీ తెలుస్తుంది
స్వచ్ఛమైన నెయ్యిని వేడి చేసినప్పుడు అది స్పష్టమైన ద్రవంగా మారుతుందని, త్వరగా కరిగిపోతుందని, అదే కల్తీ నెయ్యి అయితే ఎక్కువ సమయం పడుతుందని దీనితో కూడా గుర్తించవచ్చునని చెబుతున్నారు. ఇక నీటిని వేడి చేస్తే అందులో ఒక టూ టీ స్పూను నెయ్యి వేసి కరిగిస్తే స్వచ్ఛమైన నెయ్యి పైన తేలుతుందని, కల్తీ నెయ్యి దిగువకు మునిగిపోతుందని లేదా నీళ్లలో కలిసిపోతుందని చెబుతున్నారు.
నెయ్యి కల్తీ గుర్తించటం
ఇక రుచి ద్వారా కూడా స్వచ్ఛమైన నెయ్యిని, కల్తీ నెయ్యిని గుర్తించవచ్చు అని చెబుతున్నారు. ఒక పేపర్ పైన లేదా ఒక తెల్లటి వస్త్రం పైన నెయ్యి చుక్కను వేసి ఉంచితే కొన్ని నిమిషాలలో స్వచ్ఛమైన నెయ్యి జిడ్డుగా మరక పడదని, అదే కల్తీ నెయ్యి జిడ్డుగా మరక పడుతుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
గరం గరం పాయా సూప్ తీసుకోండి చాలు- ఏ పుత్తూరు కట్టూ అవసరం లేదు -
సండే స్పెషల్ "కడక్‌నాథ్ కోడి మాంసం".. నాటు కోడి కంటే బెస్ట్ టేస్ట్ ? -
వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే "వెజిటెబుల్ మజ్జిగ పులుసు" ట్రై చేస్తారా..? -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..!












Click it and Unblock the Notifications