పాల తాలికలు .. ట్రెడీషనల్ ఆంధ్రా పాయసం!

పాల తాలికలు అంటే తెలుగు ఇంటి వంటల్లో ఒక స్పెషల్ సంప్రదాయం. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ఇంట్లో తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టడం, కొత్త పెళ్లికూతుళ్లకు సారెలో ఇవ్వడం వంటి ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ వంట తిన్న ప్రతీసారీ బాల్య స్మృతులు గుర్తుకు వస్తాయి.

అమ్మలు, అమ్మమ్మల తీపి జ్ఞాపకం పాలతాలికలు

మన అమ్మలు, అమ్మమ్మలు చేసి పెట్టిన జ్ఞాపకాలు మనకు మధురంగా అన్పిస్తాయి. మృదువైన పాల తాలికలు పాలలో మునిగి, బెల్లం పాకంతో కలిసి, ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ లతో ముస్తాబై చూడటానికి సూపర్ గా, తినటానికి అద్భుతంగా ఉంటాయి. అటువంటి పాలతాలికలు సూపర్ గా రావాలంటే ఎలా చెయ్యాలి. పక్కా కొలతలతో చేస్తే పాల తాలికలు సూపర్ గా ఉంటాయి.

How To Make PalaThalikalu Authentic Recipe For Perfect Soft traditional palathalikalu At Home

కావాల్సిన పదార్థాలు

తడి బియ్యం పిండి – 1 కప్

బెల్లం – 1 కప్

సగ్గుబియ్యం – 1 కప్

పాలు – ½ లీటర్

నీళ్లు – 250 మి.లీ.

యాలకల పొడి – 1 టీస్పూన్

నెయ్యి – 3 టీస్పూన్లు

జీడిపప్పు, ఎండు కొబ్బరి పలుకులు, కిస్మిస్ – తగినంత

తయారీ విధానం:

ముందుగా తడి బియ్యం పిండి తయారు చేయాలి. బియ్యం కడిగి రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు వడకట్టి కొంతసేపు ఆరబెట్టి మెత్తగా పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ పిండి మృదువుగా ఉండాలి. బెల్లంలో కొంచెం నీళ్లు పోసి కరిగించి, ఆ చల్లారిన పాకంలో తడి బియ్యం పిండి వేసి ముద్దగా కలపాలి. ఈ ముద్దను చిన్న ఉండలు చేసి, పొడవుగా మురుకులాగా తీర్చి తాలికలుగా తయారు చేయాలి.

ఇలా చేస్తే పాలతాలికలు సూపర్

పాలు, నీళ్లు కలిపి మరిగించి, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి సగం ఉడికించాలి. ఆ తర్వాత తాలికలు వేసి మూత పెట్టి సన్నని సెగ మీద 12-15 నిమిషాలు ఉడికించాలి. తాలికలు ఉడికిన తర్వాత చల్లారిన బెల్లం పాకం, యాలకల పొడి వేసి కలపాలి. చివరగా నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కొబ్బరి పలుకులు, కిస్మిస్ వేపి మొత్తం మిశ్రమంలో కలిపేయాలి. కాస్త చల్లారాక తినాలి. అప్పుడు తాలికలు పాలను బాగా పీల్చుకుని మరింత రుచికరంగా ఉంటాయి.

రుచికరమైన 'కొబ్బరి లవుజు'.. ఈ కొలతలతో చేస్తే నోట్లో కరిగిపోతుంది!
రుచికరమైన 'కొబ్బరి లవుజు'.. ఈ కొలతలతో చేస్తే నోట్లో కరిగిపోతుంది!

ఈ టిప్స్ తో అద్భుతంగా పాలతాలికలు

తడి బియ్యం పిండి వాడితేనే తాలికలు మృదువుగా, పాలు బాగా పీల్చుకుని ఉంటాయి. బెల్లం పాకం వేడిగా పోయకూడదు, చల్లారిన తర్వాతే కలపాలి. తాలికలు మందంగా లేదా పల్చగా కాకుండా సరైన సైజులో చేయాలి.ఈ టిప్స్ పాటిస్తే పాల తాలికలు చాలా బాగా వస్తాయి. ఈ సంప్రదాయ వంట ఇంట్లో తయారు చేసి కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఆస్వాదించండి. పండుగ వేళల లోనే కాదు ఎప్పుడైనా సరే ఇది ట్రెడీషనల్ స్పెషల్ పాయసం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+