కొవ్వు ఐస్ లా కరిగి స్లిమ్ అవ్వటమే కాదు, అందానికి ఐస్ క్యూబ్స్ థెరపీ!
చాలామంది శరీరంలో కొవ్వును కరిగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు జిమ్ ల వెంట పరుగులు పెడుతుంటే మరికొందరు డైట్ ప్లాన్స్ పైన ఆధారపడతారు. ఇంకొందరు వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్లకు, కొవ్వు కరిగించుకునే ఆపరేషన్లకు వెళ్లి ప్రాణాలను రిస్క్ లో పెట్టుకుంటారు.
ఉదయం లేవగానే ఈ పని చేస్తే కొలెస్ట్రాల్ కు చెక్
ఉదయం లేవగానే ప్రతిరోజు మనం చేసే ఒక పని మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మన బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. కొవ్వు కరిగించుకోవడానికి ఇప్పటి వరకు అమలు చేస్తున్న ప్లాన్స్ ఏవి వర్కౌట్ కాని వారు ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ పని చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అమెరికన్ కెమికల్ సొసైటీ చేసిన అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది.

శరీరంలో కొవ్వు కరిగించే ఐస్ క్యూబ్స్
ఉదయం లేవగానే రెండు ఐస్ క్యూబ్ లు తింటే అది మన బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. మన శరీరంలో నమ్మలేనంత ఫ్యాట్ ను ఇది తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి షార్ట్ కట్ గా ఐస్ క్యూబ్స్ ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. వర్కౌట్ చేసిన తర్వాత ఒక గ్లాసు చల్లని వాటర్ మిలన్ జ్యూస్ తాగితే అది కూడా మన కొవ్వును కరిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
బరువు తగ్గించేందుకు ఐస్ క్యూబ్స్
బరువును తగ్గించడానికి వేడి పానీయాలు మాత్రమే కాదు చల్లటి పానీయాలు కూడా ఉపయోగపడతాయి .ఉదయాన్నే వేడి వేడిగా కాఫీ తీసుకునే కన్నా, కోల్డ్ కాఫీ ని తాగినట్లయితే ఇది మన శరీరంలో కొవ్వును కరిగించే మెకానిజంను ఉత్తేజపరిచి మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇక పాలల్లో కూడా రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే కొవ్వు పెరగడానికి ఇది దోహదం చేస్తుంది.
ఐస్ క్యూబ్స్ తో ఆరోగ్యమే కాదు అందం
పుదీనా జ్యూస్ లో ఐస్ వేసుకొని తాగితే ఇది కూడా మన శరీరంలో కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యం మాత్రమే కాదు అందం కూడా ఇనుమడింపబడుతుంది. ఐస్ క్యూబ్స్ వేసిన బౌల్ ను తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి ఫేస్ ను ఉదయం లేచిన వెంటనే డిప్ చేస్తే మన ముఖం కాంతివంతం అవుతుంది.
చర్మ ఆరోగ్యానికి ఐస్ క్యూబ్స్
చర్మ ఆరోగ్యానికి ఇది దోహదం చేస్తుంది. ఈ ప్రక్రియ మన ముఖం పైన ముడతలను మచ్చలను తొలగించడానికి దోహదం చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఐస్ క్యూబ్స్ ను ప్రతిరోజు ఉపయోగించి ఆరోగ్యంతో పాటు అందాన్ని పొందండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications