Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీపీతో పాటు ఈ అనారోగ్య సమస్యలుంటే మెంతులు అస్సలు తినొద్దు.. డేంజర్!

చాలామంది మెంతులు తినడం ఆరోగ్యం అని భావిస్తారు. మెంతులు తినడం వల్ల నానబెట్టుకున్న మెంతుల నీళ్లు తాగడం వల్ల మన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందని చెబుతారు. అయితే మెంతులు తినడం అందరికీ మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

మెంతులతో ఆరోగ్యం
మెంతులు మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయో అతిగా తింటే అంతే అనారోగ్య సమస్యలకు కూడా కారణం అవుతాయి. మెంతులు శరీరంలోని చక్కర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని చాలామంది ప్రతిరోజూ ఉదయం మెంతుల గింజలను నానబెట్టిన నీళ్లను తాగుతూ ఉంటారు.

If you have these health problems along with BP don t eat fenugreek at all

మెంతులలో పోషకాలు పుష్కలం
మెంతులలో ఫైబర్, ప్రొటీన్, కొవ్వు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మెంతులు కడుపు సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులను ముఖ్యంగా డయాబెటిస్ ను తగ్గిస్తాయి. అయితే మెంతులు కేవలం చక్కెర తగ్గించడానికి ఉపయోగపడినా, ఇదే సమయంలో శరీరంపై దుష్ప్రభావాన్ని చూపుతాయి.

వీరు మెంతులు తీసుకోకూడదు
అధిక రక్తపోటు ఉన్నవారికి మెంతులు తీసుకోవటం మంచిది కాదు. మెంతులు తీసుకోవడం వల్ల మన బీపీ పెరుగుతుంది. అధిక రక్త పోటుతో బాధపడేవారు మెంతులు తీసుకోకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. మెంతులు ఎక్కువగా తీసుకునే వారిలో శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతాయి.

మెంతులు ఎక్కువగా తింటే ఈ అనారోగ్య సమస్యలు
మెంతులు ఊపిరితిత్తులకు హానిచేస్తాయి. మెంతులు ఎక్కువగా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఇక గర్భిణీ స్త్రీలు కూడా మెంతులు తీసుకోవడం మానుకోవాలి. గర్భధారణ సమయంలో మెంతులను తీసుకుంటే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. మెంతులు ఎక్కువగా తినటం వలన వాంతులు, విరేచనాలు,కడుపు ఉబ్బరం, తల తిరగటం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

మెంతులు తినే విషయంలో జాగ్రత్త
మెంతులు ఎక్కువగా తీసుకునే వారిలో మూత్రం దుర్వాసన వస్తుంది. కనుక మెంతులు తీసుకునేవారు ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకొని పరిమితంగా తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా వీలైతే ఒక ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి వారి సూచనల మేరకు తీసుకుంటే మంచిది. ఇకపైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మెంతులు విషంతో సమానం .. అందుకే వీరు తినకుండా ఉంటే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+