పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్ బెల్స్ మోగినట్టే.. జాగ్రత్త!

పాదాలు.. మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి భాగం. పాదాల ఆరోగ్యమనేది ప్రతి ఒక్కరికి అత్యంత కీలకం. మన శరీర బరువును మోసి మనం కదలడానికి, నడవడానికి ఉపయోగపడే పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరంలో ముఖ్యమైన భాగమైన పాదాల ఆరోగ్యం గురించి పాదాలలో కనిపించే కొన్ని లక్షణాలు మనలో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతాయన్న విషయాలను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే ఏమవుతుంది
పాదాలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. పాదాలలో కనిపించే కొన్ని లక్షణాలు శరీరంలో తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా మారుతాయి. అందుకే పాదాలలో ఎటువంటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఆ లక్షణాలను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. చాలామంది పాదాలలో వాపు ఉంటుంది. ఈ వాపు సాధారణంగా ఎక్కువ సేపు నిలబడడం వల్ల, లేదంటే అలసిపోవడం వల్ల వస్తుంది.

If you see these symptoms in your feet it s like danger bells are ringing Be careful

కాళ్ళలో వాపు, కాళ్ళు చల్లబడటం
అయితే ఈ వాపు ఎక్కువ కాలం పాటు ఉంటే కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే వైద్యులను సంప్రదించాల్సిందే. గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, కాలేయ రుగ్మతలు, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కాళ్లల్లో వాపు కనిపిస్తుంది. కనుక కాళ్ళల్లో వాపు కంటిన్యూగా ఉంటే వైద్యున్ని సంప్రదించండి. చాలామంది అరికాళ్ళు చల్లబడుతూ ఉంటాయి. ఇలా అరికాళ్ళు చల్లబడడం ఏమాత్రం మంచిది కాదు.

పాదాల జలదరింపు, తిమ్మిరి
ఇది రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడానికి సంకేతంగా చెప్పవచ్చు అధిక రక్తపోటు గుండె జబ్బులతో ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు రక్తహీనత థైరాయిడ్ సమస్యల వల్ల కూడా పాదాలు చల్లబడే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందిలో పాదాలు జలదరింపు లేదా తిమ్మిరి పదేపదే వస్తుంది. ఇది నరాల సంబంధిత సమస్యల సంకేతం కూడా కావచ్చు డయాబెటిక్ వల్ల వచ్చే న్యూరోపతిలో పాదాలు జలదరింపు తిమ్మిరి ఒక లక్షణం.

ఈ లక్షణాలున్నా తీవ్ర అనారోగ్య సమస్యలు
ఇక ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ లేదా నరాల వాపుతో పాదాల నొప్పి రోజుల తరబడి వచ్చే అవకాశం ఉంది. ఇక పాదాల చర్మ రంగు మారడం, పొడి బారడం, దురద వంటి లక్షణాలు అనేక వ్యాధులకు సంకేతం చక్కగా చెప్పొచ్చు. ఇక డయాబెటిస్ రోగులలో కూడా పాదాల చర్మం నల్లగా మారే అవకాశం ఉంది. చర్మం పొడిబారడం, ఇన్ఫెక్షన్లు రావడం, చర్మంలో మార్పులు సంభవించడం సంభవించవచ్చు.

అనారోగ్య సమస్యలను సూచించే లక్షణాలు
కాలిగోళ్ళ రంగు మారడం, మందంగా మారడం, విరిగిపోవడం వంటి సమస్యలు కూడా మన శరీరంలోని ఇతర అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. పాదాలపై గాయాలు అయితే పుండ్లు మానకపోవడం, డయాబెటిస్ తో వచ్చే అతి పెద్ద ప్రమాదం. తరచుగా కాళ్ళ కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కూడా మన శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలను సూచించే లక్షణాలు. కనుక అసలే నిర్లక్ష్యం చేయొద్దు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+