దీనిని రోజూ ఆహారంలో తీసుకుంటే.. బీపీ, షుగర్ కంట్రోల్, వెయిట్ లాస్ పక్కా!

ఆయుర్వేదంలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో రకాల పదార్థాలు ఉన్నాయి. అటువంటి వాటిలో శొంఠి ఒకటి. ఎండిపోయిన అల్లాన్ని శొంఠి అంటారు. దీనిని పొడిగా చేసి మనం పరిమిత మోతాదులో నిత్యం తీసుకుంటూ ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎన్నో పోషకాలతో కూడుకున్న శొంఠిలో మన ఆరోగ్యానికి మేలు చేసే, వ్యాధులను నయం చేసే సామర్థ్యం ఉంది.

శొంఠితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
శొంఠి పొడిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మనకు కలిగే అనారోగ్యాల నుండి శొంఠి రక్షిస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఇన్ఫ్లుఎంజా వంటి సమస్యలను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి కూడా శొంఠి ఉపయోగపడుతుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేసి, జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది.

If you take dry ginger in your diet daily it will definitely control your BP sugar and obesity

ఈ సమస్యలకు శొంఠితో చక్కని పరిష్కారం
మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. శొంఠి వికారం, వాంతులు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. భోజనంలో శొంఠి పొడి తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో కాస్త శొంఠి పొడిని కలుపుకొని ఉదయాన్నే తీసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది.

డయాబెటిస్ ను కంట్రోల్ చేసే శొంఠి
శొంఠి కొవ్వు కరగడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.శొంఠి ఆకలిని పెంచుతుంది. శొంఠి రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించి డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పి, తలనొప్పులు వంటి వాటిని తగ్గించడంలో శొంఠి ఎంతగానో ఉపయోగపడుతుంది. కడుపు నొప్పిని తగ్గించడంతోపాటు కడుపులో అసౌకర్యం, జీర్ణ సమస్యలు తగ్గించడంలోనూ శొంఠి కీలక భూమిక పోషిస్తుంది.

మెటబాలిజం పెంచే శొంఠి
శొంఠి మన శరీరానికి వేడిని ఇవ్వటానికి సహాయపడుతుంది. మన మెటబాలిజం పెంచి, వేగంగా బరువు తగ్గేందుకు దోహదం చేసే శొంఠి నిత్యం పరిమిత మోతాదులో తీసుకోగలిగితే అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+