బరువు తగ్గాలన్నా, ఆరోగ్యం కావాలన్నా ఇన్స్టంట్ జొన్న దోసెలు ఇలా చేసి తినండి!

మనం సహజంగా తయారు చేసుకునే దోసెలలో మినప్పప్పు మంచిదే అయినా అందులో మనం బియ్యం కూడా ఎక్కువ వేసి రుబ్బుకోవటం వలన, ఆ దోసెలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు మిల్లెట్ దోశలపై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారు జొన్నలతో అప్పటికప్పుడు ఇన్స్టంట్ దోసెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే మంచిది.

జొన్న దోసెలు ఆరోగ్యానికి బెస్ట్

జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచివి. డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి బ్రేక్‌ఫాస్ట్ ఎంపిక. అటువంటి జొన్న దోసె ఎలా చేస్తే రుచిగా ఉంటుంది. ఎలా చేస్తే తినే వారికి ఆరోగ్యం వస్తుంది అనేది ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం జొన్న దోసెల తయారీ చూద్దాం.

instant jonna dosa this is the way of making tastiest jowar dosa for healthy life style easy to do

కావలసిన పదార్థాలు

జొన్న పిండి - 1 కప్పు

బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు (క్రిస్పీగా ఉండాలని అనుకుంటేనే)

పెరుగు - 2 టేబుల్ స్పూన్లు

ఉల్లిపాయ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి తరిగింది - 1

జీలకర్ర - ½ టీ స్పూన్

ఉప్పు - సరిపడా

నీరు - అవసరమైనంత

నూనె - దోశ వేయడానికి

తయారీ విధానం

ఒక బౌల్‌లో ఒక కప్పు జొన్న పిండి, రెండు స్పూన్ల బియ్యం పిండి వేసి కలపాలి.ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. పెరుగు వేసి కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ దోశ పిండిలా దానిని పలుచగా కలపాలి. ఆపై ఒక పావుగంట నుండి అరగంట వరకు నానబెట్టి దోసెలు వస్తే బాగా వస్తుంది. కనీసం 15 నిముషాలు అయినా జొన్న పిండిని నానబెట్టి తర్వాత దోసెలు వేసుకోవాలి.

దోసెలు ఇలా చేసి తింటే బాగుంటుంది

పెనం పెట్టి పెనం వేడి అయిన త్వరాత దానికి కొద్దిగా నూనె రాయాలి. పిండిని మధ్యలో పోసి దోసెల మాదిరిగా రుద్దాలి. మళ్ళీ అంచుల చుట్టూ కూడా నూనె వేసి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా చేసిన దోసెలను టమాటా పచ్చడి, కొబ్బరి పచ్చడి, పల్లీ చట్నీలలో కలిపి తింటే చాలా బాగుంటుంది.

దోసెలు చేసేందుకు ఈ టిప్స్ పాటిస్తే సూపర్ హెల్దీ

అయితే పిండిని తయారు చేసుకున్న తర్వాత పిండిని 10-15 నిమిషాలు ఉంచితే దోశలు మృదువుగా వస్తాయి. ఇక ఈ దోసెలు మరింత ఆరోగ్యకరంగా కావాలంటే మెంతులు కొద్దిగా వేసుకోవచ్చు.ఇంకా టేస్టీగా హెల్దీగా కావాలంటే కూరగాయలతురుమును చాలా సన్నగా చేసి పిండిలో కలిపి వేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా క్యారెట్, కొత్తిమీర వంటివి యాడ్ చేస్తే దోసెలు సూపర్ టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యాన్ని ఇస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+