ఇన్‌స్టంట్ ఉలవకట్టు చారు: ఇలా చేస్తే సూపర్ టేస్ట్!

ఆంధ్రుల సాంప్రదాయ వంటకాల్లో ఉలవ కట్టు చారుకు ప్రత్యేక స్థానం ఉంది. పాతకాలంలో పెద్దలు వారానికి రెండు మూడు సార్లు ఈ చారును తప్పనిసరిగా తీసుకునేవారు. ఉలవల్లో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఊబకాయం తగ్గడానికి సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది.

కావాల్సినవి:

ఉలవలు - పావు కప్పు
చింతపండు - నిమ్మకాయ సైజు
నీళ్లు - 1 నుంచి 1¼ లీటరు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర టీస్పూన్
పచ్చిమిర్చి - 2 నుంచి 3 (చీల్చినవి)
బెల్లం - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా తరిగినది
ధనియాలు - 2 టీస్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
మెంతులు - అర టీస్పూన్
ఎండుమిర్చి - 3 నుంచి 4
ఎండు కొబ్బరి ముక్కలు - 3 ఇంచులు
వెల్లుల్లి - 3 నుంచి 4 రెబ్బలు
అల్లం - 1 ఇంచ్ ముక్క
నూనె - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 1
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
కరివేపాకు - కొద్దిగా
ఇంగువ - పావు టీస్పూన్

Instant Ulava Kattu Charu Recipe make authentic Andhra-style Traditional Horse Gram Rasam

తయారీ:

ఉలవలను లో ఫ్లేమ్‌లో కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి చల్లార్చి మెత్తగా పొడి చేయాలి. చింతపండును నానబెట్టి రసం తీసి ఉలవ పొడి, ఉప్పు కలపాలి. ధనియా, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కొబ్బరి పొడి చేసి వెల్లుల్లి, అల్లం కలిపి పేస్ట్ చేయాలి. నూనెలో పోపు వేసి ఉల్లిపాయ వేగిన తర్వాత మసాలా పేస్ట్, పసుపు వేసి ఉలవ-చింత రసం పోయాలి.

పచ్చిమిర్చి, బెల్లం వేసి 15-20 నిమిషాలు మరిగించాలి. చివర్లో కొత్తిమీర చల్లాలి. కాస్త చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది. వేడి అన్నంలో కాస్త నెయ్యి కలిపి తింటే శరీరానికి తేలికగా, హాయిగా ఉంటుంది. వారానికి రెండు సార్లు తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. ఇది నిజంగా మన శరీరానికి మేలు చేసే చాలా మంచి ఆహారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+