Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇన్సులిన్ వాడినా డయాబెటిస్ తగ్గటం లేదా? ఇలా చేస్తే తప్పక తగ్గుతుంది!

డయాబెటిస్ ఇప్పుడు సమాజంలో ఒక భాగంగా మారిపోయింది. ఏ ఇంట్లో చూసినా డయాబెటిస్ బాధితులు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు పట్టిపీడిస్తున్న అతి పెద్ద దీర్ఘకాలిక వ్యాధిగా డయాబెటిస్ మారింది. డయాబెటిస్ బారిన పడినవారు తమకు తెలియకుండానే శరీరంలోని ఆర్గాన్స్ పైన తీవ్ర ప్రభావాన్ని చూస్తారు. డయాబెటిస్ బాధితులు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోకపోతే అది మనకు తీవ్ర అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.

ఇన్సులిన్ తీసుకున్నా డయాబెటిస్ తగ్గటం లేదా?
ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ తో బాధపడుతూ ఇన్సులిన్ తీసుకుంటున్నారు. ఇన్సులిన్ తీసుకున్నా షుగర్ లెవెల్స్ తగ్గడం లేదని చాలామంది బాధపడుతున్నారు. అటువంటివారు డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవడానికి ఇన్సులిన్ తీసుకోవడం మాత్రమే కాదు జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. జీవనశైలి మార్పులతో డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవచ్చని వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.

Insulin is not helping to reduce diabetes If you follow these it will definitely work to control diabetes

డయాబెటిస్ బాధితుల ఆహారం ఇలా
మందులు వాడడం మాత్రమే కాదు ఆహార నియమాలు, వ్యాయామాన్ని జీవితంలో భాగంగా చేసుకుంటే డయాబెటిస్ ను కంట్రోల్ చేయవచ్చని సూచిస్తున్నారు.
డయాబెటిస్ తో బాధపడేవారు ఖచ్చితమైన ఆహార నియమాలను పాటిస్తే మంచిది. డయాబెటిస్ బాధితులు కార్బోహైడ్రేట్లు తక్కువ తీసుకొని ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కార్బోహైడ్రేట్ లో ఎక్కువ తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

డయాబెటిస్ బాధితులు ఆహారం ఇలా తినాలి
మనం తినే అన్నంలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తింటే మంచిది. అంతేకాదు అన్నంతో పాటు తినే కూరల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. కప్పు అన్నానికి రెండు కప్పుల కూరలను తింటే మంచిది. ఇక్కడ డయాబెటిస్ తో బాధపడేవారు తృణధాన్యాల ఆహారాన్ని తింటే మరీ మంచిది.

ఇవి తింటే డయాబెటిస్ కు చెక్
రాగులు, కొర్రలు, ఊదలు, అండ్రు కొర్రలు, జొన్నలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ఇక పండ్లు తినాలనుకుంటే బొప్పాయి పండు, జామ పండు వంటి పండ్లను తినడం మంచిది. డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి భోజనాన్ని ఏడు గంటల లోపే పూర్తి చేస్తే మంచిది.

వాకింగ్, వ్యాయామం తప్పని సరిగా చేస్తే మంచిది
ఇక ప్రతిరోజు ఉదయం కాసేపు వ్యాయామం, రాత్రి భోజనం చేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేస్తే మంచిది. ఇక ఈ నియమాలను పాటిస్తే ఖచ్చితంగా డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది. ఇన్సులిన్ తీసుకునే అవసరం లేకుండానే డయాబెటిస్ ను అప్పుడు అదుపులో పెట్టవచ్చు. డయాబెటిస్ బాధితులు ముఖ్యంగా చేయవలసింది జీవనశైలి మార్పు. అది చేయగలిగితే క్రమ పద్ధతిలో జీవించగలిగితే డయాబెటిస్ ఇబ్బంది పెట్టదు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+